Share News

Andhra Pradesh farmers: పంటల మద్దతు ధరలపై మంత్రుల కమిటీ

ABN , Publish Date - May 21 , 2025 | 04:38 AM

రైతులకు గిట్టుబాటు ధరల కోసం సీఎం చంద్రబాబు ఆరుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పీఎం కిసాన్‌తో పాటు ‘అన్నదాత సుఖీభవ’ ద్వారా రైతులకు సాయం అందిస్తామని వెల్లడించారు.

Andhra Pradesh farmers: పంటల మద్దతు ధరలపై మంత్రుల కమిటీ

పీఎంకిసాన్‌తోపాటే అన్నదాత-సుఖీభవ.. రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధం: సీఎం

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతుల్ని ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై పర్యవేక్షణకు ఆరుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. మిర్చి, బర్లీ పొగాకు, ఆక్వా, కోకో, చెరకు, మామిడి తదితర పంటలకు ధరలు తగ్గడానికిగల కారణాలను అధికారులు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ ‘పంటలకు ఈసారి ధరలు తగ్గాయి. మనం కూడా మానటరింగ్‌ చేయాలి. రైతులకు గిట్టుబాటు ధర దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌ సబ్‌కమిటీ నిరంతర పర్యవేక్షణ చేయాలి’ అని సీఎం అన్నారు. అన్నదాత-సుఖీభవ కింద రైతులకు అందించనున్న సాయాన్ని పీఎం కిసాన్‌ సొమ్ముతోపాటు జమ చేద్దామని సీఎం అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 04:38 AM