Share News

ఆన్‌లైన్‌ గేమ్‌లతో అప్పుల పాలై యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jul 13 , 2025 | 01:33 AM

ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడి అప్పులపాలై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దకాపులేఅవుట్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

ఆన్‌లైన్‌ గేమ్‌లతో అప్పుల పాలై యువకుడి ఆత్మహత్య

తిరుపతి(నేరవిభాగం), జూలై 12(ఆంరఽధజ్యోతి): ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడి అప్పులపాలై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దకాపులేఅవుట్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈస్ట్‌ ఎస్‌ఐ గిరిబాబు వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలానికి చెందిన మురళి(33) కొన్ని రోజులుగా తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లో కాపురముంటూ మసాలా ప్యాకెట్లు మార్కెటింగ్‌ చేస్తున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటుపడ్డాడు. స్నేహితుల నుంచి రూ.పది లక్షల వరకు అప్పు చేశాడు.వడ్డీ పెరిగిపోవడంతో అప్పు తీర్చలేక పోయాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగింది.ఈ విషయమై గొడవలు జర గడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన మురళి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరిబాబు తెలిపారు.

Updated Date - Jul 13 , 2025 | 01:33 AM