కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య..
ABN , Publish Date - Jul 04 , 2025 | 02:03 AM
కుటుంబ కలహాలతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా.. అత్తింటి వారే చంపేశారంటూ మృతురాలి బం ధువులు ధర్నాకు దిగా రు. వివరాలిలా ఉన్నా యి. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన శిల్ప (25)కు, తడ మండలం అక్కంపేటకు చెందిన కాటయ్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు సంతానం. కొంతకాలంగా కుటుంబంలో కలతలురేగి గొడవలకు దారితీశాయి. కొద్ది రోజులక్రితం ఇరు కుటుంబాల పెద్దల చర్చలతో రాజీ ఏర్పడింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి మరోసారి ఇంట్లో శిల్ప, భర్త, అత్తమామలతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె రాత్రి గదిలోకి వెళ్లి చీరతో ఉరేసుకుంది. గురువారం ఉదయం గుర్తించిన భర్త, అత్తమామలు భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. శిల్ప పుట్టింటి వారు అక్కంపేటకు చేరుకున్నారు. ఆమె చావుకు భర్త, అత్తమామలే కారణమంటూ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భర్త కాటయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అత్తింటివారే చంపేశారంటూ
మృతురాలి బంధువుల ధర్నా
తడ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాలతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా.. అత్తింటి వారే చంపేశారంటూ మృతురాలి బం ధువులు ధర్నాకు దిగా రు. వివరాలిలా ఉన్నా యి. చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన శిల్ప (25)కు, తడ మండలం అక్కంపేటకు చెందిన కాటయ్యతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు సంతానం. కొంతకాలంగా కుటుంబంలో కలతలురేగి గొడవలకు దారితీశాయి. కొద్ది రోజులక్రితం ఇరు కుటుంబాల పెద్దల చర్చలతో రాజీ ఏర్పడింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి మరోసారి ఇంట్లో శిల్ప, భర్త, అత్తమామలతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె రాత్రి గదిలోకి వెళ్లి చీరతో ఉరేసుకుంది.
గురువారం ఉదయం గుర్తించిన భర్త, అత్తమామలు భయపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. శిల్ప పుట్టింటి వారు అక్కంపేటకు చేరుకున్నారు. ఆమె చావుకు భర్త, అత్తమామలే కారణమంటూ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని సముదాయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. భర్త కాటయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.