Share News

పుట్టిన రోజు వేడుకల్లో యువకుల ఆగడం

ABN , Publish Date - Jul 25 , 2025 | 02:02 AM

వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయానంద రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉద్రిక్తతకు దారితీశాయి.నగరంలోని గంగా కాలనీలో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన కార్యక్రమానికి విజయానంద రెడ్డి అనుచరుడైన వైసీపీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఆను తదితరులు వెళ్లారు.అక్కడ కేకును కట్‌ చేసి మహిళలపైకి విసరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పుట్టిన రోజు వేడుకల్లో యువకుల ఆగడం
చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుల వద్ద కేసు వివరాలు రాసుకుంటున్న పోలీసులు

మహిళల పట్ల విజయానంద రెడ్డి అనుచరుల అనుచిత ప్రవర్తన

చిత్తూరు అర్బన్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయానంద రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉద్రిక్తతకు దారితీశాయి.నగరంలోని గంగా కాలనీలో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన కార్యక్రమానికి విజయానంద రెడ్డి అనుచరుడైన వైసీపీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఆను తదితరులు వెళ్లారు.అక్కడ కేకును కట్‌ చేసి మహిళలపైకి విసరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేకును మహిళలపై ఎందుకు విసరతారని అక్కడున్న ఓ మహిళ ప్రశ్నించింది. దీంతో ఆను అనుచరులు ఆ మహిళ పైకి దూసుకెళ్లడంతో పాటు నిలువరించడానికి వెళ్లిన ముగ్గురు యువకులపై దాడి చేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పెద్దది కాకుండా అదుపు చేశారు.ఆను అనుచరుల చేతిలో గాయపడిన వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.ఈ లోపు ఆస్పత్రి సమీపంలో వున్న ఆను ఇంటి పైకి సుమారు పాతికమంది యువకులు దాడికి ప్రయత్నించారు. ఎక్కడి నుంచో వచ్చి తమ కాలనీలో కేక్‌ కట్‌ చేయడమే కాకుండా మహిళలపై కేక్‌ విసిరి.. దాడికి పాల్పడతారా అంటూ రాళ్లను ఆను ఇంటిపై విసిరారు.

Updated Date - Jul 25 , 2025 | 02:02 AM