రాంగ్ రూట్‌లో వచ్చిన బైక్
ABN , Publish Date - Aug 05 , 2025 | 02:09 AM
చంద్రగిరి మండలం పనపాకం వద్ద పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిలో సోమవారం రాత్రి రాంగ్ రూట్‌లో వస్తున్న బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
పనపాకం వద్ద లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకుల దుర్మరణం
చంద్రగిరి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండలం పనపాకం వద్ద పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిలో సోమవారం రాత్రి రాంగ్ రూట్‌లో వస్తున్న బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు.. బంగారుపాళ్యం మండలం తంబుగనిపల్లెకు చెందిన గడ్డం హరీ్‌షనాయుడు(27), పరంధామ(33) బైక్‌పై చిత్తూరు నుంచి తిరుపతి వైపు వస్తున్నారు. తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతున్న లారీ పనపాకం వద్ద రాంగ్ రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీ కొంది. ఈప్రమాదంలో గడ్డం హరీ్‌షనాయుడు, పరంధామ తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందారు. పరంధామకు ఏడాది కిందటే వివాహమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.