Share News

చంద్రబాబు సహకారంతోనే మూడోసారి అధికారంలోకి..

ABN , Publish Date - Jul 04 , 2025 | 02:16 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం వల్లే కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారిత మంత్రి రామ్‌దాస్‌ అథవాలే అన్నారు. గురువారం చిత్తూరులోని పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాలలో దివ్యాంగులకు ఉపకరణాలు, ద్విచక్రవాహనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను దృష్టిలో ఉంచుకుని దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సుగమ్య భారత్‌ అభియాన్‌ కింద దేశవ్యాప్తంగా 1314 ప్రభుత్వ భవనాలను అందుబాటులోకి తేవడానికి రూ.563.85 కోట్లను విడుదల చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా 8.34లక్షల పాఠశాలల్లో ర్యాంపులు, టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు.

చంద్రబాబు సహకారంతోనే   మూడోసారి అధికారంలోకి..
దివ్యాంగురాలికి ఎలక్ర్టిక్‌ వాహనాన్ని పంపిణీ చేస్తున్న కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తదితరులు

కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే

చిత్తూరు అర్బన్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం వల్లే కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిందని కేంద్ర సామాజిక, న్యాయ, సాధికారిత మంత్రి రామ్‌దాస్‌ అథవాలే అన్నారు. గురువారం చిత్తూరులోని పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాలలో దివ్యాంగులకు ఉపకరణాలు, ద్విచక్రవాహనాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను దృష్టిలో ఉంచుకుని దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సుగమ్య భారత్‌ అభియాన్‌ కింద దేశవ్యాప్తంగా 1314 ప్రభుత్వ భవనాలను అందుబాటులోకి తేవడానికి రూ.563.85 కోట్లను విడుదల చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా 8.34లక్షల పాఠశాలల్లో ర్యాంపులు, టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో యాక్సిసబుల్‌ ఇండియా ప్రచారం కింద 38 భవనాలకు రూ.29.69 కోట్లను విడుదల చేశామని వివరించారు. ఉపకార వేతనాల కింద 2.81 లక్షల మంది విద్యార్థులకు రూ.921.50 కోట్లను అందించామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులకు సాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయని, అందులో ‘అలింక’ ఒకటన్నారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 3,678 మంది బుద్ధిమాంద్యం, అంగవైకల్యం కల్గినవారికి రూ.4.69 కోట్ల ఉపకరణాలను పంపిణీ చేసిందన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో 68మందికి ట్రైసైకిళ్లు, 383 మందికి వినికిడి యంత్రాలు, 17 మందికి వీల్‌చైర్లు, 110మందికి టచ్‌ఫోన్లు, 62 మందికి వాకింగ్‌ స్టిక్స్‌, 97 మందికి బ్లైండ్‌ వాకింగ్‌స్టిక్స్‌ను అందించడం ఆనందంగా ఉందన్నారు. మేయర్‌ అముద, ట్రైనీ కలెక్టర్‌ నరేంద్ర పాడల్‌, డీఆర్వో మోహన్‌కుమార్‌, ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా బాబు, బీజేపీ నేతలు చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 02:16 AM