Share News

ఆ ఐరిస్‌ స్కానర్లు వెనక్కొస్తాయా?

ABN , Publish Date - Nov 20 , 2025 | 02:04 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ సరుకుల పంపిణీ కోసం ఎండీయూ ఆపరేటర్లకు సరఫరా చేసిన ఐరిస్‌ స్కానర్లను వెనక్కు తీసుకోవడం అధికారులకు తలనొప్పిగా తయారైంది.రేషన్‌ డీలర్ల స్థానంలో ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి రేషన్‌ సరుకులను అప్పట్లో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థ స్థానంలో రేషన్‌ డీలర్ల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతున్న విషయం తెలిసిందే.వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని 1379 చౌకదుకాణాలకు 336 ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేసి ఐరిస్‌ స్కానర్లను అందించారు. వాటిని వెనక్కివ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఎండీయూ ఆపరేటర్లను కోరినా ఇప్పటివరకు 275 స్కానర్లు మాత్రమే అధికారులకు చేరాయి. మిగిలిన 61 ఏమయ్యాయో తెలియడం లేదు. వెనక్కురాని స్కానర్లను ఈ నెలాఖరులోగా తెప్పించాలంటూ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు రావడంతో అధికారులు ఎండీయూ ఆపరేటర్లను వెతికే పనిలో పడ్డారు. కొందరు ఆపరేటర్లు బాధ్యత లేకుండా వాటిని మూలపడేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వెనక్కివ్వకుంటే ఒక్కో ఐరిస్‌ స్కానర్‌కు రూ.6400వంతున వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఆ ఐరిస్‌ స్కానర్లు వెనక్కొస్తాయా?

-ఎండీయూ ఆపరేటర్లను వెతికే పనిలో అధికారులు

-ఇవ్వకుంటే స్కానర్‌కు రూ.6400 వంతున వసూలు చేసే ప్రయత్నం

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ సరుకుల పంపిణీ కోసం ఎండీయూ ఆపరేటర్లకు సరఫరా చేసిన ఐరిస్‌ స్కానర్లను వెనక్కు తీసుకోవడం అధికారులకు తలనొప్పిగా తయారైంది.రేషన్‌ డీలర్ల స్థానంలో ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి రేషన్‌ సరుకులను అప్పట్లో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థ స్థానంలో రేషన్‌ డీలర్ల ద్వారా సరుకుల పంపిణీ చేపడుతున్న విషయం తెలిసిందే.వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని 1379 చౌకదుకాణాలకు 336 ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేసి ఐరిస్‌ స్కానర్లను అందించారు. వాటిని వెనక్కివ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఎండీయూ ఆపరేటర్లను కోరినా ఇప్పటివరకు 275 స్కానర్లు మాత్రమే అధికారులకు చేరాయి. మిగిలిన 61 ఏమయ్యాయో తెలియడం లేదు. వెనక్కురాని స్కానర్లను ఈ నెలాఖరులోగా తెప్పించాలంటూ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ నుంచి ఉత్తర్వులు రావడంతో అధికారులు ఎండీయూ ఆపరేటర్లను వెతికే పనిలో పడ్డారు. కొందరు ఆపరేటర్లు బాధ్యత లేకుండా వాటిని మూలపడేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వెనక్కివ్వకుంటే ఒక్కో ఐరిస్‌ స్కానర్‌కు రూ.6400వంతున వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చాలామంది ఆపరేటర్లు తాము స్కానర్లను డీలర్లకు ఇచ్చేశామని చెబుతున్నారు. కొంతమంది వీఆర్వోలకు ఇచ్చేశామంటున్నారు.అయితే బాధ్యత ఎండీయూ ఆపరేటర్లదే కాబట్టి డబ్బులు అతడే కట్టాల్సి వుంది. గతంలో ఎండీయూ ఆపరేటర్లకు వాహనానికి పదిశాతం లబ్ధిదారుడి వాటాతో వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలను మంజూరు చేశారు. నాలుగున్నరేళ్లగా ఈఎంఐలు చెల్లించిన ఆపరేటర్లు మిగిలిన మొత్తాన్ని ఆయా కార్పొరేషన్ల ద్వారా బ్యాంకులకు చెల్లించి వాహనానికి క్లియరెన్స్‌ పొందాల్సి వుంది.దీంతో వాహనాలకు బ్యాలెన్స్‌ ఈఎంఐలు కట్టించుకునేటప్పుడే ఐరిస్‌ స్కానర్లు వెనక్కివ్వని ఎండీయూ ఆపరేటర్లనుంచి రూ.6400వంతున వసూలు చేయాలని బ్యాంకర్లకు డీఎస్వో లేఖలు రాశారు.మరి ఈ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో వేచిచూడాల్సి వుంది.

Updated Date - Nov 20 , 2025 | 02:04 AM