Share News

చిత్తూరులో యూనివర్శిటీ ఏర్పాటయ్యేనా?

ABN , Publish Date - Sep 25 , 2025 | 02:47 AM

చిత్తూరులో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ బుధవారం అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ వర్శిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.జిల్లాల విభజన తర్వాత ప్రముఖ యూనివర్శిటీలు, విద్యాసంస్థలు కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో చేరిపోగా చిత్తూరు జిల్లాకు చెప్పుకోదగ్గ విద్యాసంస్థ ఏదీ లేదు. అప్పటి నుంచి చిత్తూరు వాసులు జిల్లా కేంద్రంలో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ మొదలు పెట్టారు. ఎన్నికల సమయంలో పెద్దఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ చిత్తూరులో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఆ మేరకు ఎమ్మెల్యే జగన్మోహన్‌ గతేడాది నవంబరులో సీఎం చంద్రబాబును కలిసి యూనివర్శిటీ ఏర్పాటు చేయమని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. ఉన్నత విద్యా శాఖ అధికారులను కలిసి ప్రాసెస్‌ గురించి తెలుసుకున్నారు. ఈ క్రమంలో చిత్తూరులోని పీవీకేఎన్‌ కాలేజీలో యూనివర్శిటీ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని అవగాహనకు వచ్చారు. దీంతో సుమారు రూ.30 లక్షల సొంత నిధులతో పీవీకేఎన్‌లో మౌలిక వసతులు కల్పించి న్యాక్‌ గ్రేడ్‌ వచ్చేలా చేశారు. వర్శిటీ ఏర్పాటుకు ఈ గ్రేడ్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. తాజాగా బుధవారం అసెంబ్లీలో వర్శిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.మంత్రి నారా లోకేశ్‌ బదులిస్తూ యూనివర్శిటీ ఏర్పాటు తమ బాధ్యతగా భావించి చర్యలు తీసుకుంటామని చెప్పారు..

చిత్తూరులో యూనివర్శిటీ ఏర్పాటయ్యేనా?

  • అసెంబ్లీలో మరోసారి కోరిన ఎమ్మెల్యే

  • కృషి చేస్తామన్న మంత్రి నారా లోకేశ్‌

చిత్తూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): చిత్తూరులో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ బుధవారం అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ వర్శిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.జిల్లాల విభజన తర్వాత ప్రముఖ యూనివర్శిటీలు, విద్యాసంస్థలు కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో చేరిపోగా చిత్తూరు జిల్లాకు చెప్పుకోదగ్గ విద్యాసంస్థ ఏదీ లేదు. అప్పటి నుంచి చిత్తూరు వాసులు జిల్లా కేంద్రంలో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ మొదలు పెట్టారు. ఎన్నికల సమయంలో పెద్దఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ చిత్తూరులో యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఆ మేరకు ఎమ్మెల్యే జగన్మోహన్‌ గతేడాది నవంబరులో సీఎం చంద్రబాబును కలిసి యూనివర్శిటీ ఏర్పాటు చేయమని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. ఉన్నత విద్యా శాఖ అధికారులను కలిసి ప్రాసెస్‌ గురించి తెలుసుకున్నారు. ఈ క్రమంలో చిత్తూరులోని పీవీకేఎన్‌ కాలేజీలో యూనివర్శిటీ ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని అవగాహనకు వచ్చారు. దీంతో సుమారు రూ.30 లక్షల సొంత నిధులతో పీవీకేఎన్‌లో మౌలిక వసతులు కల్పించి న్యాక్‌ గ్రేడ్‌ వచ్చేలా చేశారు. వర్శిటీ ఏర్పాటుకు ఈ గ్రేడ్‌ను కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. తాజాగా బుధవారం అసెంబ్లీలో వర్శిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.మంత్రి నారా లోకేశ్‌ బదులిస్తూ యూనివర్శిటీ ఏర్పాటు తమ బాధ్యతగా భావించి చర్యలు తీసుకుంటామని చెప్పారు..

యూనివర్శిటీ అనేది చిత్తూరు వాసుల చిరకాల కల. 115 ఏళ్లుగా జిల్లా కేంద్రంగా ఉన్న చిత్తూరులో చెప్పుకోదగ్గ విద్యాసంస్థలు లేవు. వున్న ఉన్నత విద్యాసంస్థలన్నీ జిల్లాల విభజనతో తిరుపతిలో ఉండిపోయాయి. ఇక్కడ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే చిత్తూరు నియోజకవర్గంలోని విద్యార్థులతో పాటు జిల్లా విద్యార్థులకూ ఉపయోగపడుతుంది. గతేడాది సీఎంను కలిసి కోరగా ఆయన మాటిచ్చారు. చిత్తూరులోని పీవీకేఎన్‌ కాలేజీలో వంద ఎకరాలకు పైగా స్థలం ఉంది. అన్ని సౌకర్యాలు కల్పించి దీనికి న్యాక్‌ ఏ గ్రేడ్‌ కూడా తీసుకొచ్చాం. చిత్తూరుతో పాటు పొరుగున ఉన్న మూడు నియోజకవర్గాల్లో 57కుపైగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు, 13 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. 13వేల మంది ఇంటర్‌, 7 వేల మంది డిగ్రీ విద్యార్థులు చదువుతున్నారు. చిత్తూరుకు నలువైపులా హైవేలు ఉండడం, బుల్లెట్‌ ట్రైన్‌ కూడా మంజూరైన క్రమంలో ఇక్కడ యూనివర్శిటీ ఏర్పాటుచేస్తే భవిష్యత్తు తరాలకు మంచి చేసేలా మన ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోతుంది.

- ఎమ్మెల్యే జగన్మోహన్‌

ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ గారు గతేడాది నవంబరులో సీఎంకు లేఖ రాశారు. చిత్తూరు నియోజకవర్గంలో యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని కోరారు. విభజన తర్వాత చిత్తూరులో ప్రభుత్వం తరఫున ద్రావిడ, ప్రైవేటు అపోలో యూనివర్శిటీలు మాత్రమే ఉన్నాయి. సీఎం ప్రతి జిల్లాలో కనీసం ఓ ప్రైవేటు లేదా ప్రభుత్వ యూనివర్శిటీ ఉండాలని మాకు సూచించారు. ద్రావిడ యూనివర్శిటీ అనేది భాషాభివృద్ధి కోసం ఏర్పాటు చేసింది. చిత్తూరులో యూనివర్శిటీ ఏర్పాటు మా బాధ్యతగా భావించి చర్యలు తీసుకుంటాం.

-మంత్రి నారా లోకేశ్‌

Updated Date - Sep 25 , 2025 | 02:47 AM