వన్యప్రాణి సంరక్షణే హనుమాన్ లక్ష్యం
ABN , Publish Date - Nov 10 , 2025 | 01:46 AM
అడవి జంతువుల సంరక్షణ, చికిత్స, పునరావాసం కోసం రూపొందించిన హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ వైల్డ్ లైఫ్ (హనుమాన్) ప్రాజెక్టును విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవణ్ కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు.పలమనేరు మండలం ముసలిమడుగులో ఆదివారం ఆయన హనుమాన్ ప్రాజెక్టుపై పలు సూచనలు చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు హనుమాన్ ప్రాజెక్టుపై ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో పడ్డారు.కోతులు, పాములు, ఏనుగులు, పులులు, సింహాలు, జింకలు.... ఇలా అన్ని రకాలైన వన్యప్రాణులను సంరక్షించడం, వాటి బారి నుంచి మనుషులను కాపాడడం, వన్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ప్రాణహాని లేకుండా చూడటం హనుమాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.ఏ జంతువు ద్వారా కూడా ఎవరికీ ఇబ్బంది రాకుండా, వాటి ఉత్పత్తి పెంచడం, తగ్గించడంపైనా దృష్టి సారించనున్నారు. ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లో కోతుల ద్వారా సమస్యలు ఏర్పడితే వాటి సంతతిని క్రమబద్దీకరించడం, ఉత్పత్తి తగ్గిన సమయంలో సంతతిని పెంచడం హనుమాన్ ప్రాజెక్టులో భాగం.
ప్రత్యేక టీముల ఏర్పాటు, శిక్షణ
డివిజన్‌కు ఒక అంబులెన్స్ అందుబాటులోకి
ప్రత్యేక వెటర్నరీ డాక్టర్ నియామకం
చిత్తూరు సెంట్రల్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): అడవి జంతువుల సంరక్షణ, చికిత్స, పునరావాసం కోసం రూపొందించిన హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ వైల్డ్ లైఫ్ (హనుమాన్) ప్రాజెక్టును విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవణ్ కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు.పలమనేరు మండలం ముసలిమడుగులో ఆదివారం ఆయన హనుమాన్ ప్రాజెక్టుపై పలు సూచనలు చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు హనుమాన్ ప్రాజెక్టుపై ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో పడ్డారు.కోతులు, పాములు, ఏనుగులు, పులులు, సింహాలు, జింకలు.... ఇలా అన్ని రకాలైన వన్యప్రాణులను సంరక్షించడం, వాటి బారి నుంచి మనుషులను కాపాడడం, వన్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ప్రాణహాని లేకుండా చూడటం హనుమాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.ఏ జంతువు ద్వారా కూడా ఎవరికీ ఇబ్బంది రాకుండా, వాటి ఉత్పత్తి పెంచడం, తగ్గించడంపైనా దృష్టి సారించనున్నారు. ఉదాహరణకు కొన్ని ప్రాంతాల్లో కోతుల ద్వారా సమస్యలు ఏర్పడితే వాటి సంతతిని క్రమబద్దీకరించడం, ఉత్పత్తి తగ్గిన సమయంలో సంతతిని పెంచడం హనుమాన్ ప్రాజెక్టులో భాగం. ఈ ప్రాజెక్టు కింద ప్రతి జంతు జాతికి సంబంధించి ఒక టీమును ఏర్పాటు చేయనున్నారు. వారికి ఆ జంతువుకు సంబంధించిన సంరక్షణ, పోషణ, ఉత్పత్తి, ప్రమాదాల బారిన పడిన సమయంలో వాటికి ఎలాంటి వైద్యం చేయాలనే దానిపై శిక్షణ ఇవ్వనున్నారు. గాయపడిన, ప్రమాదాల బారిన పడిన వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖలో ప్రతి డివిజన్‌కు ఒక అంబులెన్స్‌ను అందుబాటులో వుంచనున్నారు.పశువైద్యానికి అవసరమైన మందులన్నీ అంబులెన్స్‌లో వుంటాయి.