Share News

జిల్లా అంతటా విస్తృతంగా వర్షాలు

ABN , Publish Date - Aug 12 , 2025 | 01:34 AM

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో తేలికపాటి నుంచి విస్తృతంగా వర్షాలు కురిశాయి.

జిల్లా అంతటా విస్తృతంగా వర్షాలు

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో తేలికపాటి నుంచి విస్తృతంగా వర్షాలు కురిశాయి. నగరిలో అత్యధికంగా 72.4 మి.మీ, బంగారుపాళ్యంలో అత్యల్పంగా 3.2 మిమీ వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. జీడీ నెల్లూరులో 68.2, చిత్తూరు రూరల్‌లో 51.8, చిత్తూరు అర్బన్‌లో 50.4, ఐరాల, గుడిపాలలో 50.2, పూతలపట్టులో 49.2, కార్వేటినగరంలో 46.2, సదుంలో 40.2, రొంపిచెర్లలో 37.2, సోమలలో 34.6, నిండ్రలో 32.2, యాదమరిలో 32, విజయపురంలో 30.4, పెనుమూరులో 18, చౌడేపల్లెలో 16.2, ఎస్‌ఆర్‌పురంలో 14.2, పెద్దపంజాణిలో 12.2, గుడుపల్లెలో 11.5, రామకుప్పంలో 10.6, పుంగనూరులో 9.8, వెదురుకుప్పంలో 9.4, తవణంపల్లెలో 8.2, కుప్పంలో 8, గంగవరంలో 7.4, బైరెడ్డిపల్లెలో 6.6, పాలసముద్రంలో 6.2, వి.కోటలో 5.6, పలమనేరులో 5, పులిచెర్లలో 4.6, శాంతిపురంలో 4.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

Updated Date - Aug 12 , 2025 | 01:35 AM