Share News

‘సర్క్యులర్‌ ఎకానమీ’పై విస్తృత ప్రచారం

ABN , Publish Date - Oct 16 , 2025 | 02:19 AM

సర్క్యులర్‌ ఎకానమీపై విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ కృష్ణయ్య సూచించారు. రాష్ట్ర సర్క్యూలర్‌ ఎకానమీ- వేస్ట్‌ రీసైక్లింగ్‌ పాలసీపై కలెక్టరేట్‌లో బుధవారం ఆయన సమీక్షించారు.

‘సర్క్యులర్‌ ఎకానమీ’పై విస్తృత ప్రచారం
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ కృష్ణయ్య

కాలుష్య నియంత్రణమండలి చైర్మన్‌ కృష్ణయ్య సూచన

తిరుపతి(కలెక్టరేట్‌), అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): సర్క్యులర్‌ ఎకానమీపై విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ కృష్ణయ్య సూచించారు. రాష్ట్ర సర్క్యూలర్‌ ఎకానమీ- వేస్ట్‌ రీసైక్లింగ్‌ పాలసీపై కలెక్టరేట్‌లో బుధవారం ఆయన సమీక్షించారు. ప్రతి వస్తువును వ్యర్థంగా కాకుండా వనరుగా చూడాలన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రీసైక్లింగ్‌ పాలసీని రూపొందించిందన్నారు. చికెన్‌, చేపల దుకాణాల్లో వచ్చే వ్యర్థాలను ఫిష్‌మీల్‌, ప్రొటీన్‌ ఫీడ్‌గా, రొయ్యల వ్యర్థాల నుంచి కైటిన్‌ అనే విలువైన పదార్థం తీసి అరోగ్య ఉత్పత్తుల్లో వాడుతున్నారని వివరించారు. సర్క్యులర్‌ ఎకనామీ అంటే వ్యర్థమే అనేది ఉండకూడదని, ప్రతి వస్తువును తిరిగి వాడటమన్నారు. దాని వల్ల ఆర్ధికాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతాయన్నారు. ముఖ్యంగా వెటర్నరీ, అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలలో పౌలీ్ట్రవేస్ట్‌, వ్యవసాయ వ్యర్థాలపై పరిశోధన చేసి రైతులకు ఉపయోగపడే మోడల్స్‌ను సృష్టించాలన్నారు. శ్రీకాళహస్తి-నాయుడుపేట జాతీయ రహదారిలో పొయ్య వద్ద, వీసీఐసీ మార్గంలో సర్క్యులర్‌ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ మౌర్య, కాలుష్యనియంత్రణమండలి ఈఈ రాజశేఖర్‌, నాగేశ్వరరాజు, డీపీవో సుశీలదేవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 02:19 AM