Share News

పాఠశాలకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు?

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:10 AM

ప్రభుత్వ పాఠశాల విధులకు టీచర్లు ఆలస్యంగా రావడంపై వివరణ కోరామని డీఈవో వరలక్ష్మి తెలిపారు.

పాఠశాలకు ఆలస్యంగా ఎందుకు వచ్చారు?

- వంద మంది టీచర్లను వివరణ కోరామన్న డీఈవో

చిత్తూరు సెంట్రల్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాల విధులకు టీచర్లు ఆలస్యంగా రావడంపై వివరణ కోరామని డీఈవో వరలక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో వంద మంది టీచర్లు పాఠశాలకు ఆలస్యంగా హాజరైనట్లు గుర్తించామన్నారు. ఆలస్యానికి గల కారణాలు తెలియజేయాలని వారిని కోరామన్నారు. టీచర్లు సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం వంటివి చేయకూడదని చెప్పారు.

Updated Date - Nov 04 , 2025 | 01:10 AM