రుణాల విడుదల ఎప్పుడు?
ABN , Publish Date - Jul 20 , 2025 | 01:09 AM
ఎస్సీ, బీసీ, ఈబీసీ నిరుద్యోగ యువకులు సబ్సిడీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో సబ్సిడీ రుణాల కోసం ఇంటర్యూలు నిర్వహించారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ సభ్యులు అర్హులను ఎంపిక చేశారు. మూడు నెలలైనప్పటికీ ఆ అర్హుల జాబితాను బీసీ కార్పొరేషన్ కార్యాలయానికి పంపలేదు.వైసీపీ హయాంలో ఐదేళ్లూ సబ్సిడీ రుణాలను మంజూరు చేయకపోవడంతో పేద యువకులు స్వయం ఉపాధి రుణాలకు నోచుకోలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలను పునరుద్ధరించింది.
ఎస్సీ, బీసీ, ఈబీసీ నిరుద్యోగుల ఎదురుచూపులు
మూడు నెలలైనా ప్రకటించని అర్హుల జాబితా
చిత్తూరు అర్బన్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, బీసీ, ఈబీసీ నిరుద్యోగ యువకులు సబ్సిడీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో సబ్సిడీ రుణాల కోసం ఇంటర్యూలు నిర్వహించారు. పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు, మండలాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ సభ్యులు అర్హులను ఎంపిక చేశారు. మూడు నెలలైనప్పటికీ ఆ అర్హుల జాబితాను బీసీ కార్పొరేషన్ కార్యాలయానికి పంపలేదు.వైసీపీ హయాంలో ఐదేళ్లూ సబ్సిడీ రుణాలను మంజూరు చేయకపోవడంతో పేద యువకులు స్వయం ఉపాధి రుణాలకు నోచుకోలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కార్పొరేషన్లకు సబ్సిడీ రుణాలను పునరుద్ధరించింది.
ఫ మూడు నెలలైనా ప్రకటించని అర్హుల జాబితా
బీసీ కార్పొరేషన్‌తో పాటు ఈబీసీ కార్పొరేషన్, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాలకు చెందిన 3555మందికి రుణాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వ రాయితీగా రూ. 60కోట్లు, బ్యాంకు రుణంగా రూ. 60 కోట్లు విడుదల చేయనుంది. అలాగే ఎస్సీ కార్పొరేషన్ కింద 954మందికి ప్రభుత్వం సబ్సిడీ కింద రూ. 15.70 కోట్లు, బ్యాంకు రుణం కింద రూ. 2212కోట్ల విడుదల చేయనుంది. సబ్సిడీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేస్తే నిరుద్యోగ యువకులు యూనిట్లను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. 2014-19 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆదరణ పథకం కింద చేతివృత్తుల వారికి అవసరమైన పనిముట్లను పంపిణీ చేసింది.ప్రస్తుతం లబ్ధిదారుల ఇష్టానికి అనుగుణంగా యూనిట్లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో పలువురు లబ్ధిదారులు ఆధునిక పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు.2025-26వ ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలలు గడిచిపోయాయని, ఇప్పుడూనా ప్రభుత్వం రుణాలను మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
గ్రౌండింగ్ చేసినా ఫలితం లేదు
బీసీ కార్పొరేషన్ ద్వారా అన్ని సామాజికవర్గాలకు కలిపి 3555 యూనిట్లను మంజూరు చేయగా సుమారు 27వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ నెలలో 1200మంది లబ్ధిదారుల యూనిట్లను గ్రౌడింగ్ చేసింది. అయితే ఇంత వరకు గ్రౌండింగ్ అయిన లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 954యూనిట్లకు గాను 15వేల మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సంబంధించిన దరఖాస్తులన్నీ ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ల స్థాయిలోనే ఆగిపోయింది.
వేగంగా టైలరింగ్ శిక్షణా కార్యక్రమం
బీసీ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గ కేంద్రాల్లో టైలరింగ్‌పై శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తం 5533 మందికి 26 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభంకాగా వాటిలో 60 రోజుల శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగిలిన 30 రోజులు పూర్తయిన వెంటనే శిక్షణ పొందుతున్న మహిళలకు సర్టిఫికెట్లతో పాటు టైలరింగ్ యంత్రాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు.