మంచు కురిసిన వేళ!
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:56 AM
రామకుప్పం ప్రాంతాన్ని శనివారం ఉదయం దట్టమైన పొగమంచు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. తెల్లవారుజామున 4గంటల నుంచి ఉదయం 7.30గంటల వరకు మంచు తొలగలేదు.చలితీవ్రత పెరిగి జనం ఇళ్ళ నుంచి బయటకు వచ్చేందుకు జంకారు.
రామకుప్పం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : రామకుప్పం ప్రాంతాన్ని శనివారం ఉదయం దట్టమైన పొగమంచు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. తెల్లవారుజామున 4గంటల నుంచి ఉదయం 7.30గంటల వరకు మంచు తొలగలేదు.చలితీవ్రత పెరిగి జనం ఇళ్ళ నుంచి బయటకు వచ్చేందుకు జంకారు. వాహనదారులు హెడ్‌లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచు ఆవరించడంతో రామకుప్పం పట్టణ శివార్లలోని పొలాలు, తోటలు, ననియాల ఎకోటూరిజం ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకుని వీక్షకులకు కనువిందు చేశాయి.