ప్రైవేటు బస్సుల వేగానికి కళ్లెమేదీ?
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:20 AM
కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున కావేరి ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 20మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరోసారి ప్రయాణికుల భద్రతను చర్చనీయాంశం చేసింది.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అప్పుడప్పుడూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ప్రైవేటు బస్సుల వేగానికి రవాణా శాఖ అధికారులు కళ్ళెం వేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం, బస్సు పూర్తిస్థాయిలో కండిషన్ లేకపోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి.నామ మాత్రపు తనిఖీలతో, అప్పుడప్పుడూ జరిమానాలతో రవాణా శాఖ అధికారులు సరిపెట్టేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఒకట్రెండు రోజులు తనిఖీలతో హడావుడి చేస్తున్నారని వారిపై అపప్రధ వుంది.అదీకాక ఇతర రాష్ర్టాల్లో ట్యాక్సులు తక్కువగా వుండడంతో 80 శాతం ప్రైవేటు బస్సులకు మిజోరాం, నాగాలాండ్, అరుణాచల ప్రదేశ్, డయ్యూ డామన్ ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్లు చేసి అక్కడే ఇన్సూరెన్సు, ఎఫ్‌సీలు తీసుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదుగా వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న బస్సులను రిజిస్ర్టేషన్ చేసుకున్న ప్రాంతానికి వెళ్ళి రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసి కండిషన్ బాగుందని ధృవీకరించిన తర్వాతనే రోడ్డుపైకి రావాలి. అయితే బస్సులు ఇక్కడ రోడ్లపైన తిరుగుతుండగానే అక్కడ లంచాలిచ్చి ఎఫ్‌సీలు తెచ్చుకుంటున్నారనే విమర్శలు చాలాకాలంగా వున్నాయి.ప్రస్తుతం రోడ్లపైన తిరుగుతున్న బస్సుల్లో ఎన్నింటికి ఎఫ్‌సీ వుంది, ఎన్నింటికి ఇన్సూరెన్సు వుంది, ఎన్నింటికి ఫైర్ డిటెక్షన్ అలారాలున్నాయి అనే విషయం ఇక్కడ రవాణా శాఖ అధికారులకు తెలియడంలేదు.
-ఈశాన్య రాష్ర్టాల్లో రిజిస్ర్టేషన్లు, ఎఫ్‌సీలు
-డొల్ల తనిఖీలతో రోడ్లపై ఫిట్‌లెస్ వాహనాలు
చిత్తూరు, ఆంధ్రజ్యోతి
గత ఏడాది మే 19న బెంగళూరు నుంచి అమలాపురం వెళుతున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సుకు రేణిగుంట వద్ద రెండు టైర్లు పేలి వెనుక భాగం దగ్ధమైంది. ఈ ఘటనలో దాదాపు 10మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఏడాది జనవరిలో చిత్తూరు నగర శివారు ప్రాంతమైన గంగాసాగరం వద్ద ఓ అర్ధరాత్రి తిరుపతి నుంచి మధురై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు టిప్పర్‌ను ఢీకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 2న నగరి మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా గుడి సమీపంలో జరిగిన ప్రమాదంలో భారతి బస్సు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా 10మంది తీవ్రంగా గాయపడ్డారు.
కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున కావేరి ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సు దగ్ధమై 20మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరోసారి ప్రయాణికుల భద్రతను చర్చనీయాంశం చేసింది.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అప్పుడప్పుడూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా ప్రైవేటు బస్సుల వేగానికి రవాణా శాఖ అధికారులు కళ్ళెం వేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళడం, బస్సు పూర్తిస్థాయిలో కండిషన్ లేకపోవడం వంటి కారణాలతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి.నామ మాత్రపు తనిఖీలతో, అప్పుడప్పుడూ జరిమానాలతో రవాణా శాఖ అధికారులు సరిపెట్టేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఒకట్రెండు రోజులు తనిఖీలతో హడావుడి చేస్తున్నారని వారిపై అపప్రధ వుంది.అదీకాక ఇతర రాష్ర్టాల్లో ట్యాక్సులు తక్కువగా వుండడంతో 80 శాతం ప్రైవేటు బస్సులకు మిజోరాం, నాగాలాండ్, అరుణాచల ప్రదేశ్, డయ్యూ డామన్ ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్లు చేసి అక్కడే ఇన్సూరెన్సు, ఎఫ్‌సీలు తీసుకుంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదుగా వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న బస్సులను రిజిస్ర్టేషన్ చేసుకున్న ప్రాంతానికి వెళ్ళి రవాణా శాఖ అధికారులు తనిఖీ చేసి కండిషన్ బాగుందని ధృవీకరించిన తర్వాతనే రోడ్డుపైకి రావాలి. అయితే బస్సులు ఇక్కడ రోడ్లపైన తిరుగుతుండగానే అక్కడ లంచాలిచ్చి ఎఫ్‌సీలు తెచ్చుకుంటున్నారనే విమర్శలు చాలాకాలంగా వున్నాయి.ప్రస్తుతం రోడ్లపైన తిరుగుతున్న బస్సుల్లో ఎన్నింటికి ఎఫ్‌సీ వుంది, ఎన్నింటికి ఇన్సూరెన్సు వుంది, ఎన్నింటికి ఫైర్ డిటెక్షన్ అలారాలున్నాయి అనే విషయం ఇక్కడ రవాణా శాఖ అధికారులకు తెలియడంలేదు.
జాగ్రత్తలు తీసుకుందాం
ఫ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు రిజిస్ర్టేషన్, లైసెన్సు వివరాలను చెక్ చేయండి.ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉందేమో అడగండి.
ఫ డ్రైవర్ స్థితిని గమనించండి. మత్తులో ఉన్నట్లు లేదా అలసటగా వున్నట్టు కనిపిస్తే ఆ బస్సులో ప్రయాణం చేయకండి.
- బస్సు బయల్దేరే ముందు లోపల ఎగ్జిట్ డోర్, ఫైర్ అలారమ్ గురించి తెలుసుకోండి.
- ప్రమాదకర వస్తువులైన గ్యాస్ సిలిండర్లు, కెమికల్స్ మొదలైనవి తీసుకెళ్లకండి.
ఆరు నెలల్లో 125 బస్సులపై కేసులు
నిత్యం వాహనాలను తనిఖీ చేస్తున్నాం. ఆరు నెలల్లో సుమారు 125 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశాం. మన రాష్ట్రంలో తిరిగే ప్రైవేటు బస్సులు చాలావరకు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ర్టేషన్‌తో ఉన్నాయి.
-నిరంజన్‌రెడ్డి, డీటీసీ, చిత్తూరు