Share News

శ్రీకాళహస్తిలో ఏం జరుగుతోంది?

ABN , Publish Date - Sep 10 , 2025 | 02:14 AM

వెయ్యి మంది మగశిశువులకు.. 629 ఆడ శిశువులు మాత్రమే జన్మిస్తున్నారు. ఇదీ గత మూడు నెలల్లో శ్రీకాళహస్తిలోని జనన గణాంకాల నిష్పత్తి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1000:900 ఉంటే, శ్రీకాళహస్తిలో మాత్రం ఆ నిష్పత్తి ప్రమాదకరంగా ఉంది. ఈ నివేదికను చూసి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి మల్టీ మెంబర్స్‌ అడ్వైజర్స్‌ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో విచారణ కమిటీ వేసి విచారించి.. కారణాలు విశ్లేషించి నెలలోపు నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బాలకృష్ణ నాయక్‌ను ఆదేశించారు. ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లు, నర్సింగ్‌ హోం వైద్యులపై నిఘా పెట్టాలన్నారు. జిల్లాలో లింగనిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టంచేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దుచేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మారుమూల గ్రామాల్లోనూ లింగనిర్ధారణ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ ఆనందమూర్తి, డీఐవో శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో ఏం జరుగుతోంది?
నివేదిక చూపుతున్న కలెక్టర్‌

  • ఆడపిల్లల నిష్పత్తి ఎందుకు తగ్గుతోంది?

  • విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వెయ్యి మంది మగశిశువులకు.. 629 ఆడ శిశువులు మాత్రమే జన్మిస్తున్నారు. ఇదీ గత మూడు నెలల్లో శ్రీకాళహస్తిలోని జనన గణాంకాల నిష్పత్తి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 1000:900 ఉంటే, శ్రీకాళహస్తిలో మాత్రం ఆ నిష్పత్తి ప్రమాదకరంగా ఉంది. ఈ నివేదికను చూసి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆందోళన వ్యక్తంచేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి మల్టీ మెంబర్స్‌ అడ్వైజర్స్‌ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో విచారణ కమిటీ వేసి విచారించి.. కారణాలు విశ్లేషించి నెలలోపు నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ బాలకృష్ణ నాయక్‌ను ఆదేశించారు. ప్రైవేటు స్కానింగ్‌ సెంటర్లు, నర్సింగ్‌ హోం వైద్యులపై నిఘా పెట్టాలన్నారు. జిల్లాలో లింగనిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టంచేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దుచేయడంతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. మారుమూల గ్రామాల్లోనూ లింగనిర్ధారణ చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ ఆనందమూర్తి, డీఐవో శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 02:14 AM