Share News

మా డబ్బులు ఏమయ్యాయి?

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:29 AM

‘పెనుమూరులోని మహిళా మార్టు కోసమని మా దగ్గర తీసుకున్న డబ్బులు ఏమయ్యాయి. ప్రతి ఏడాదీ లాభాల్లో వాటా ఇస్తామన్నారు. మూడేళ్లవుతున్నా మా డబ్బుల సంగతి చెప్పడం లేదు. ప్రతినెలా ఒక్కో మహిళ వెయ్యి రూపాయలకు సరుకులు కొనాలని నిబంధన పెట్టి మరీ కొనిపించారు’ అంటూ మంగళవారం మహిళలు వెలుగు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు

మా డబ్బులు ఏమయ్యాయి?
పెనుమూరు మహిళా మార్టు

పెనుమూరు, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ‘పెనుమూరులోని మహిళా మార్టు కోసమని మా దగ్గర తీసుకున్న డబ్బులు ఏమయ్యాయి. ప్రతి ఏడాదీ లాభాల్లో వాటా ఇస్తామన్నారు. మూడేళ్లవుతున్నా మా డబ్బుల సంగతి చెప్పడం లేదు. ప్రతినెలా ఒక్కో మహిళ వెయ్యి రూపాయలకు సరుకులు కొనాలని నిబంధన పెట్టి మరీ కొనిపించారు’ అంటూ మంగళవారం మహిళలు వెలుగు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గత ప్రభుత్వంలో ఒక్కో సభ్యురాలి వద్ద రూ.300 చొప్పున మండలం మొత్తం 950 గ్రూపుల నుంచి రూ.28 లక్షలు వసూలు చేసి, మహిళా మార్టులో పెట్టుబడులు పెట్టారు. దీంతోపాటు సీఎ్‌ఫఐ ద్వారా రూ.25 లక్షలు, బీఎంసీయూ నుంచి రూ.7.5లక్షలు మొత్తం రూ.60లక్షలతో 2022లో మార్టు ప్రారంభించారు. అమ్మమొత్తం రూ.4కోట్లు అమ్మకాలు జరిగాయని.. రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. 20 శాతం లాభాలు వచ్చినా ఆ లెక్కన రూ.60 లక్షలు మిగులు తేలాలి. కానీ బ్యాంకు ఖాతాలో నగదు లేవంటే అవినీతి ఏ మేరకు జరిగిందో తెలుస్తుంది. కొన్ని లావాదేవీలకు లెక్కలు చూపక పోవడంతో మార్టులో దోబీలను, అకౌంటెంట్‌ను జిల్లా అధికారులు తొలగించారు. ఏపీఎం, సీసీలకు షోకాజ్‌ నోటీసులిచ్చి మళ్లీ వారిని విఽధుల్లోకి తీసుకున్నారని మహిళలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. మార్టును పంచాయతీ కార్యాలయంలో పెట్టాలని ఆ భవనం రీమాడలింగ్‌కు రూ.20లక్షల వరకు లెక్కలు రాసి.. టాయిలెట్‌కే రూ.3లక్షలు ఖర్చు చూపినట్లు సమాచారం. ఇకనైనా మహిళా మార్టు విషయంలో ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 01:29 AM