Share News

ఆ రోజు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:46 AM

చింటూ, వెంకటాచలపతి బురఖా ధరించి కార్యాలయం లోపలికి వెళ్లారు. వారిద్దరి వెంట జయప్రకా్‌షరెడ్డి, మంజునాథ్‌, వెంకటేష్‌ ఉన్నారు. ఐదుగురూ మేయర్‌ ఛాంబర్‌లోకి వెళ్లారు. చింటూ ముఖానికి ఉన్న బురఖాను తీసి నేనే చింటూనంటూ గట్టిగా అరిచాడు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

తేదీ: 2015 నవంబరు 17

స్థలం: చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం

సమయం: ఉదయం 11:45 గంటలు

చింటూ, వెంకటాచలపతి బురఖా ధరించి కార్యాలయం లోపలికి వెళ్లారు. వారిద్దరి వెంట జయప్రకా్‌షరెడ్డి, మంజునాథ్‌, వెంకటేష్‌ ఉన్నారు. ఐదుగురూ మేయర్‌ ఛాంబర్‌లోకి వెళ్లారు. చింటూ ముఖానికి ఉన్న బురఖాను తీసి నేనే చింటూనంటూ గట్టిగా అరిచాడు. వెంట తెచ్చుకున్న లేడీస్‌ హ్యాండ్‌ బ్యాగులోంచి పిస్టల్‌ బయటకు తీశాడు. తననేం చేయొద్దంటూ అనురాధ భయంతో గట్టిగా అరిచారు. మేయర్‌ అనురాధను పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

కఠారి మోహన్‌ అక్కడి నుంచి పరిగెత్తేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పీఏ రూమ్‌ వద్ద వెంకటేష్‌ కత్తితో నరకడంతో ఆ గాయంతోనే మోహన్‌ కేకలు పెడుతూ కాన్ఫరెన్సు హాల్లోకి పరిగెత్తారు. అక్కడ మంజునాథ్‌ కత్తితో కడుపులో పొడవగా జయప్రకా్‌షరెడ్డి కూడా నరికాడు. చింటూ, వెంకటాచలపతి పిస్టళ్లతో కాల్పులు జరిపినా మోహన్‌కు తగల్లేదు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేందుకు వెంకటాచలపతి ఎయిర్‌ గన్‌ (డమ్మీ గన్‌)తో కాల్పులు జరిపాడు. మోహన్‌కు బుల్లెట్‌ తగల్లేదు.

సతీష్‌కి గాయాలు: మేయర్‌ ఛాంబర్‌లోకి చింటూ వచ్చినప్పుడు సతీష్‌ అనే వ్యక్తి అంతకుముందే మేయర్‌తో పని ఉండి వచ్చాడు. మేయర్‌ దంపతులను కాపాడే ప్రయత్నం చేయగా, మంజునాథ్‌ అతడి వీపు మీద కత్తితో దాడి చేశాడు. దీంతో సతీష్‌ కూడా అక్కడే గాయాలతో పడిపోయాడు. ఆ తర్వాత వారు ఇంజనీర్‌ రూమ్‌ పక్కనున్న గోడ దూకి పారిపోయారు.

అనురాఽధ, మోహన్‌, సతీ్‌షలను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అప్పటికే అనురాధ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మోహన్‌, సతీ్‌షలను వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. మోహన్‌ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించారు. బతికి యటపడ్డ సతీష్‌ ఈ కేసులో ప్రధాన సాక్షిగా నిలిచారు.

హత్య చేసి పోలీసుల వద్దకు..

హత్య జరిగిన రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వెంకటాచలపతి, జయప్రకా్‌షరెడ్డి, మంజునాథ్‌ చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లారు. తమకు కఠారి మోహన్‌ అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆ ముగ్గుర్నీ గంగవరం మండలంలోని మారేడుపల్లెలో ఉన్న మంజునాథ్‌ ఇంట్లో తమ అధీనంలోనే పెట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో వారి హస్తం ఉందని తెలిసి 24వ తేదీన ఆ ముగ్గుర్నీ అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.

లొంగిపోయిన చింటూ: అదే నెల 30వ తేదీన చిత్తూరు నాలుగో కోర్టులో చింటూ లొంగిపోయారు. రిమాండుకు పంపించారు. మరో రెండు మూడు రోజుల్లో వెంకటే్‌షను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Nov 01 , 2025 | 01:46 AM