Share News

‘కిరితారా’ ఏర్పాటుకు సహకారం అందిస్తాం

ABN , Publish Date - Aug 20 , 2025 | 01:34 AM

: ఏర్పేడు సమీపంలోని ఐఐటీ వద్ద రూ.80కోట్లతో ఏర్పాటు కానున్న కిరితారా రిసార్ట్స్‌ ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. మెస్సర్స్‌ కిరితారా రిసార్ట్స్‌ సీఈవో, ఎండీ వి.సత్యనారాయణ, టూరిజం ఆర్‌డీ రమణప్రసాద్‌ మంగళవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు 500మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాటు కానున్న కిరితారా రిసార్ట్స్‌కు అన్ని విధాల సహకరిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ‘ఆసియాలోనే అతిపెద్దదైన స్విమ్మింగ్‌పూల్‌ ఏర్పాటు చేయనుంది. లగ్జరీ సూట్స్‌, విల్లాలు, ఇండోర్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఉండేలా రిసార్ట్‌ను రూపొందించారు’ అని పర్యాటకశాఖ ఆర్‌డీ రమణప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటకశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి, డైరెక్టర్లు సుబ్బరాయుడు, శ్రీనివాసులరెడ్డి, ఆర్కిటెక్‌ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

‘కిరితారా’ ఏర్పాటుకు సహకారం అందిస్తాం

  • ఆ సంస్థ ఎండీ, ప్రతినిధులతో కలెక్టర్‌

తిరుపతి(కలెక్టరేట్‌), ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఏర్పేడు సమీపంలోని ఐఐటీ వద్ద రూ.80కోట్లతో ఏర్పాటు కానున్న కిరితారా రిసార్ట్స్‌ ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. మెస్సర్స్‌ కిరితారా రిసార్ట్స్‌ సీఈవో, ఎండీ వి.సత్యనారాయణ, టూరిజం ఆర్‌డీ రమణప్రసాద్‌ మంగళవారం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు 500మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాటు కానున్న కిరితారా రిసార్ట్స్‌కు అన్ని విధాల సహకరిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ‘ఆసియాలోనే అతిపెద్దదైన స్విమ్మింగ్‌పూల్‌ ఏర్పాటు చేయనుంది. లగ్జరీ సూట్స్‌, విల్లాలు, ఇండోర్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఉండేలా రిసార్ట్‌ను రూపొందించారు’ అని పర్యాటకశాఖ ఆర్‌డీ రమణప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటకశాఖ అధికారి జనార్దన్‌రెడ్డి, డైరెక్టర్లు సుబ్బరాయుడు, శ్రీనివాసులరెడ్డి, ఆర్కిటెక్‌ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 01:34 AM