మీకవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తాం
ABN , Publish Date - Oct 18 , 2025 | 01:15 AM
అంబత్తూరు పారిశ్రామికవేత్తలతో కలెక్టర్, ఎమ్మెల్యే కోసలనగరంలో పరిశ్రమల ఏర్పాటుపై సమీక్ష
విజయపురం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): విజయపురం మండలాన్ని పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేస్తామని కలెక్టరు సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కోసలనగరంలో పరిశ్రమల ఏర్పాటుపై అంబత్తూరు ఇండస్ర్టియల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రతినిధులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోసలనగరం పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ఎ- బ్లాక్‌లో 1500 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. పారిశ్రామిక వాడకు అవసరమైన నీటి సదుపాయం, రోడ్డు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. తెలుగుంగ ప్రాజెక్టు ద్వారా నీరు నిరంతరాయంగా సరఫరా చేస్తామన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూముల రిజిస్ర్టేషన్‌కు సంబంధించి స్టాంప్ డ్యూటీని ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. పారిశ్రామిక హబ్‌తో నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం సమస్యలపై పిర్యాదులను స్వీకరించారు. అంబత్తూరు ఇండస్ర్టియల్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రతినిధి, సప్తగిరి హైమా ఇండస్ర్టియల్ పార్కు అధ్యక్షుడు హరిప్రసాద్, ఉపాధ్యక్షుడు ఆర్వేల రమేష్ నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే భానుప్రకాష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో తామంతా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చామన్నారు. ఎకరా భూమి ధర రూ.20 లక్షల లోపు అందిస్తామని కలెక్టరు హామీ ఇవ్వడంతో రెండు నెలల్లో ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.ఆర్డీవో అనుపమ, అర్‌అండ్‌బీ డీఈ సుజాత, తహసీల్దార్ కిరణ్, ఏపీఐఐసీ అధికారులు, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చుక్కా ధనంజయ యాదవ్, టీడీపీ మండల అధ్యక్షుడు రమే్‌షరాజు, సింగిల్‌విండో అధ్యక్షుడు బాబుయాదవ్, నాయకులు బాలసుబ్రమణ్యం రాజు, లోకే్‌షరాజు తదితరులు పాల్గొన్నారు.