Share News

మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం

ABN , Publish Date - Aug 05 , 2025 | 02:35 AM

మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేసి శిక్షిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. కోకకోలా కంపెనీ సహకారంతో పాలసముద్రం పీహెచ్‌సీలో నిర్మించిన మరుగుదొడ్లను, ఆపరేషన్‌ థియేటర్‌ను సోమవారం మంత్రి ప్రారంభించారు.

మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం
సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి సత్యకుమార్‌

- మంత్రి సత్యకుమార్‌

పాలసముద్రం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేసి శిక్షిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. కోకకోలా కంపెనీ సహకారంతో పాలసముద్రం పీహెచ్‌సీలో నిర్మించిన మరుగుదొడ్లను, ఆపరేషన్‌ థియేటర్‌ను సోమవారం మంత్రి ప్రారంభించారు. శాంతిపురం, విజయపురం, చౌడేపల్లె, తవణంపల్లెల్లోని పీహెచ్‌సీల్లోనూ కోకకోలా కంపెనీ సహకారంతో నిర్మించిన మరుగుదొడ్లను, ఆపరేషన్‌ థియేటర్లను వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు.అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ ధనదాహంతో నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారని గుర్తుచేశారు. మద్యం కుంభకోణంలో దోచుకున్న వేలకోట్ల సొమ్మంతా కక్కిస్తామన్నారు.ప్రజలు కూడా ఆలోచించి కూటమి ప్రభుత్వానికి అండదండలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ విప్‌ థామస్‌ మాట్లాడుతూ.. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సీసీరోడ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో సుధారాణి,ఆర్డీవో అనుపమ, ఎంపీపీ శ్యామలాశివప్రకా్‌షరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌, కోకకోలా కంపెనీ ప్రతినిధి హిమామ్‌ ప్రియదర్శన్‌, తహసీల్దార్‌ అరుణకుమారి, ఇన్‌చార్జి ఎంపీడీవో విద్యావతి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, నాయకులు వాసు నాయుడు, శివా నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 02:35 AM