వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
ABN , Publish Date - Dec 15 , 2025 | 01:52 AM
కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను అడుకుంటామని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రామ్మోహన్, కె.ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. తిరుపతిలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర మహాసభలు ఆదివారంతో ముగిశాయి.
తిరుపతి(ఆటోనగర్), డిసెంబరు14(ఆంధ్రజ్యోతి): కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటీకరణను అడుకుంటామని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రామ్మోహన్, కె.ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. తిరుపతిలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర మహాసభలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతి కింద అప్పగిస్తే పేద విద్యార్దులకు వైద్య విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే వైద్య కళాశాలలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ఏడాదిన్నర కాలంలో పాఠశాలల్లో మూడు లక్షల మంది విద్యార్థులు తగ్గారన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్మోహన్
మూడురోజులు జరిగిన సభల్లో 19 తీర్మానాలను ఆమోదించారు. రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా పి.రామ్మోహన్, కార్యదర్శిగా కె.ప్రసన్నకుమార్ రెండోసారి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా భగత్‌రవి, ఒ.పరమేష్, జి.పల్లవి, సి.హెచ్.వెంకటేశ్వర్‌రావు, సహాయ కార్యదర్శులుగా డి.రాము, వెంకటరమణ, శిరీషా, సూరిబాబు, ప్రసాద్, సమీర్, ఎంఆర్.నాయక్‌తో పాటు 54మంది సభ్యులుగా ఎన్నికయ్యారు.