స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:30 AM
బీజేపీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కావడంలో భాగంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పార్టీ పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సూచించారు.
బీజేపీ శ్రేణులకు మాధవ్ పిలుపు
చిత్తూరు సెంట్రల్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): బీజేపీ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కావడంలో భాగంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పార్టీ పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సూచించారు. సోమవారం చిత్తూరు వచ్చిన ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న లబ్ధిని వివరించాలన్నారు. ఈనెల 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే రూ.10 లక్షల కోట్లు వైసీపీ ప్రభుత్వంలో పక్కదారి పట్టాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు,ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు రాజన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర చౌదరి, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మహిళా మోర్చా నాయకురాలు నిషిధారాజు, జోనల్ ఇన్‌చార్జి బిట్రా శివనానారాయణ, జిల్లా ఇన్‌చార్జి విశ్వనాథ్, రమే్‌షనాయుడు, రామచంద్రుడు, రామచంద్ర, రాజేంద్ర, బాబు, ఈశ్వర్, రెడ్డిప్రసాద్,షణ్ముగం, రామభద్ర, గుత్తా ప్రభాకర్, రవికుమార్, బాబు, చిట్టిబాబు, గోకుల్ యాదవ్, మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా తిరంగా ర్యాలీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సోమవారం చిత్తూరుకు రాగా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.దుర్గా హోటల్ సర్కిల్‌లో ఛాయ్‌పే చర్చాలో పాల్గొని స్థానికులతో ముచ్చటించారు.మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.కేంద్రీయ విద్యాలయంతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మాధవ్ చిత్తూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం కలెక్టర్ బంగ్లా సర్కిల్‌లోని కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం కట్టమంచిలోని వివేకానంద విగ్రహం నుంచి తిరంగా ర్యాలీని ప్రారంభించారు. కోర్డు సర్కిల్, హైరోడ్డు మీదుగా సాగిన ర్యాలీ గాంఽధీ విగ్రహ సర్కిల్ చేరుకుంది. 60 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు చేతపట్టి ర్యాలీలో సాగారు.