Share News

నేలపట్టును సంరక్షించుకోవాలి

ABN , Publish Date - May 19 , 2025 | 01:20 AM

నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం చాలా మంచి పర్యావరణ ప్రకృతి కేంద్రం. ఇటువంటి ప్రాంతాన్ని సంరక్షించుకోవాలి’ అని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ భువనేశ్వర్‌ కలిత (అస్సోం రాజ్యసభ సభ్యుడు) అన్నారు. దొరవారిసత్రం మండలం నేలపట్టులోని విదేశీ విహంగాల విడిది కేంద్రాన్ని ఆదివారం ఈ కమిటీ సందర్శించింది.

నేలపట్టును సంరక్షించుకోవాలి
నేలపట్టులో పక్షులను తిలకిస్తున్న కమిటి చైర్మన్‌ భువనేశ్వర్‌ కలిత

దొరవారిసత్రం, మే 18 (ఆంధ్రజ్యోతి): ‘నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం చాలా మంచి పర్యావరణ ప్రకృతి కేంద్రం. ఇటువంటి ప్రాంతాన్ని సంరక్షించుకోవాలి’ అని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ భువనేశ్వర్‌ కలిత (అస్సోం రాజ్యసభ సభ్యుడు) అన్నారు. దొరవారిసత్రం మండలం నేలపట్టులోని విదేశీ విహంగాల విడిది కేంద్రాన్ని ఆదివారం ఈ కమిటీ సందర్శించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజ్‌ అయిపోవడంతో పక్షులను చూడలేక పోయామన్నారు. ఉన్న కొద్దిపాటి పక్షులు దూరంగా చెట్లపై ఉండటంతో కనిపించలేదన్నారు. మళ్లీ తాను జనవరిలో వ్యక్తిగతంగా వచ్చి పక్షులను చూస్తానన్నారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు వంటి అంశాలపై అధ్యయనం చేసే ఈ కమిటీ తన పర్యటనలో భాగంగా నేలపట్టుక వచ్చింది. ఉన్న కొద్దిపాటి పక్షులను బైనాక్యులర్ల ద్వారా వీ వీక్షించారు. ఈసీ కేంద్రంలోని పక్షుల జీవన శైలిపై ఫిలింషో తిలకించారు. వీరికి తిరుపతి సీసీఎఫ్‌ సెల్వం, సూళ్లూరుపేట డీఎ్‌ఫవో హారిక, ఆర్డీవో కిరణ్మయి, నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, పలువురు షార్‌ కేంద్రం అధికారులు తమ సిబ్బందితో ప్రొటోకాల్‌ ఏర్పాట్లు చేపట్టారు. కమిటీ సభ్యులు తేజస్విసూర్య (కర్ణాటక), ప్రద్యుత్‌ బోర్డోలోయ్‌ (అస్సోం), మహేష్‌ కశ్యప్‌ (ఛత్తీ్‌సగఢ్‌), త్రివేంద్రసింగ్‌ రావత్‌ (ఉత్తరాఖండ్‌), జగదాంబిక పాల్‌ (ఉత్తరప్రదేశ్‌), అప్ర్ఫెడ్‌కంగం ఆర్ధర్‌ (మణిపూర్‌) పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 01:20 AM