Share News

భారతీయ జ్ఞాన పరంపరను కాపాడుకోవాలి

ABN , Publish Date - Sep 26 , 2025 | 01:51 AM

భారతీయ జ్ఞాన పరంపరను కాపాడుకోవాలని జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ ఎన్‌. గోపాలస్వామి పేర్కొన్నారు. సంస్కృత యూనివర్సిటీలో ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టం (ఐకేఎస్‌) కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు.

భారతీయ జ్ఞాన పరంపరను కాపాడుకోవాలి
ఐకేఎస్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఛాన్స్‌లర్‌ గోపాలస్వామి

సంస్కృత వర్సిటీ ఛాన్సలర్‌ గోపాలస్వామి

తిరుపతి(విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): భారతీయ జ్ఞాన పరంపరను కాపాడుకోవాలని జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఛాన్స్‌లర్‌ ఎన్‌. గోపాలస్వామి పేర్కొన్నారు. సంస్కృత యూనివర్సిటీలో ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టం (ఐకేఎస్‌) కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. గోపాలస్వామి మాట్లాడుతూ యూనివర్సిటీలో ఐకేఎస్‌ కేంద్రం ఏర్పాటు మంచి పరిణామమని తెలిపారు. సంస్కృతంలోని ఎన్నో విజ్ఞానదాయక అంశాలను ఈ కేంద్రం ద్వారా వెలుగులోకి తీసుకురావాలని కోరారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాడగుల నాగఫణిశర్మ మాట్లాడుతూ అవధాన కళ విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పెంచుతుందన్నారు. దాని గురించి ఈ తరం తెలుసుకోవాలని కోరారు. ఐకేఎస్‌ కేంద్రం ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి వీసీ కృష్ణమూర్తి ధన్యవాదాలు తెలిపారు. ఐకేఎస్‌ నేషనల్‌ కోఆర్డినేటర్‌ సూర్యనారాయణమూర్తి, రిజిస్ట్రార్‌ వెంకటనారాయణరావు, డీన్‌ రజనీకాంత్‌శుక్లా, ప్రొఫెసర్‌ దక్షిణామూర్తిశర్మ పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2025 | 01:52 AM