చంద్రబాబుకు సాదర స్వాగతం
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:06 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం కుప్పం చేరుకున్నారు. కుప్పం మండలం పరమసముద్రం చెరువు సమీపంలో హంద్రీ- నీవా కాలువకు శనివారం ఆయన జలహారతి ఇవ్వనున్నారు.
కుప్పం/శాంతిపురం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం కుప్పం చేరుకున్నారు. కుప్పం మండలం పరమసముద్రం చెరువు సమీపంలో హంద్రీ- నీవా కాలువకు శనివారం ఆయన జలహారతి ఇవ్వనున్నారు. అక్కడే పైలాన్ ఆవిష్కరించి, బహిరంగ సభలో నియోజకవర్గ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా శుక్రవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో శాంతిపురం మండలం తుమ్మిశి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.సాగునీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, నాని, జగన్మోహన్, థామస్, కలెక్టర్ సుమిత్ కుమార్‌తోపాటు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వగృహం చేరుకున్న చంద్రబాబు కొద్దిపాటి విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం రెస్కో, కుప్పం వ్యవసాయ మార్కెట్టు కమిటీ పాలకమండళ్లు, కడా రాజకీయ సలహా మండళ్లతో సమావేశమయ్యారు. అనంతరం హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై హంద్రీ-నీవా కాలువ స్థితిగతులపై చర్చించారు.పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ బీఆర్.సురేశ్‌బాబు,ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎస్.మునిరత్నం, రెస్కో చైర్మన్ వీజీ.ప్రతాప్, ఏఎంసీ చైర్మన్ జి.మునిరాజు, టీడీపీ మున్సిపల్, మండల అధ్యక్షులు రాజ్‌కుమార్, ప్రేమ్‌కుమార్, విశ్వనాథనాయుడు, ఆనందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, సీఎం వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్, మాజీ వైస్ ఎంపీపీ ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.