జూలో వాలాబీ మృతి
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:40 AM
తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో శుక్రవారం ఎర్రమెడ గల మగ వాలాబీ అనారోగ్యంతో మృతి చెందినట్లు క్యూరేటర్ సెల్వం తెలిపారు. ‘ఈ ఏడాది ఆగస్టు 27న గుజరాత్‌కు చెందిన రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్టు ఒక జత మీర్‌కాట్స్, ఒక జత కామన్ మార్మోసెట్స్‌తో పాటు ఒక ఎర్రమెడగల వాలాబీని జూపార్కుకు విరాళంగా ఇచ్చారు.
మంగళం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో శుక్రవారం ఎర్రమెడ గల మగ వాలాబీ అనారోగ్యంతో మృతి చెందినట్లు క్యూరేటర్ సెల్వం తెలిపారు. ‘ఈ ఏడాది ఆగస్టు 27న గుజరాత్‌కు చెందిన రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్టు ఒక జత మీర్‌కాట్స్, ఒక జత కామన్ మార్మోసెట్స్‌తో పాటు ఒక ఎర్రమెడగల వాలాబీని జూపార్కుకు విరాళంగా ఇచ్చారు. అప్పట్నుంచి వీటిని సంజీవిని కార్వంటైన్‌లో ఉంచాం. గురువారం ఉదయం నుంచి వాలాబీ అనారోగ్యంతో ఆహారం తీసుకోవడం మానేసింది. జూ వైద్యసిబ్బంది దీనిని ఐసీయూలోఉంచి వైద్యం చికిత్స చేసినా.. శుక్రవారం మృతి చెందింది. కళేబరాన్ని ఎస్వీ వెటర్నరీ వర్సిటీలోని పెథాలజీ విభాగ ప్రొఫెసర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించి టాక్సో ప్లాస్మోసిస్ సమస్యతో మృతి చెందిందని నిర్ధారించారు’ అని క్యూరేటర్ తెలిపారు. వాలాబీతో పాటు తీసుకొచ్చిన మిగిలిన జంతువులు ఆరోగ్యంగా ఉన్నాయన్నారు.