ఇన్‌చార్జి జీపీగా వీఆర్ రామకృష్ణ
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:28 AM
జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న వీఆర్ రామకృష్ణను ఇన్‌చార్జి స్పెషల్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా ప్రభుత్వం నియమించింది.
పూతలపట్టు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉన్న వీఆర్ రామకృష్ణను ఇన్‌చార్జి స్పెషల్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే 8వ కోర్టు అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వున్న జ్యోతిరామ్‌ను పలమనేరు, కుప్పం కోర్టులకు, 9వ కోర్టు ఏపీపీగా వున్న శరవణ కుమార్‌ను పుంగనూరు సివిల్ కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.