రేపు ఉప రాష్ట్రపతి, సీఎం రాక
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:12 AM
తిరుమలకు బుధవారం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు రానున్నారు. బుధవారం రాత్రికి ఉప రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి.. అక్కడ్నుంచి తిరుమలకు చేరుకుని బస చేస్తారు.
తిరుపతి(కలెక్టరేట్), సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తిరుమలకు బుధవారం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు రానున్నారు. బుధవారం రాత్రికి ఉప రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి.. అక్కడ్నుంచి తిరుమలకు చేరుకుని బస చేస్తారు. గురువారం ఉదయం 7 గంటలకు స్వామి వారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమవుతారు. ఇక, సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో తిరుపతికి, అక్కడ్నుంచి తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాక, పెద్ద శేష వాహనసేవలో పాల్గొంటారు. గురువారం ఉదయం పీఏసీ-5 సముదాయాన్ని ప్రారంభించి తిరుగు ప్రయాణమవుతారు. వీరిద్దరి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సల్, కమిషనర్ మౌర్య, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి తదిరులు సమీక్షించారు. వీఐపీల పర్యటన ప్రాంతాలను పరిశీలించారు.