కానిస్టేబుళ్లుగా ఎంపికైనవారికి రేపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:58 AM
సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికైనవారు సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ఎస్పీ మణికంఠ తెలిపారు. చిత్తూరు ప్రశాంత్‌నగర్‌లోని జిల్లా పోలీసు కార్యాలయానికి ఉదయం తొమ్మిది గంటలకు హాజరుకావాలని సూచించారు.
చిత్తూరు అర్బన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికైనవారు సోమవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుందని ఎస్పీ మణికంఠ తెలిపారు. చిత్తూరు ప్రశాంత్‌నగర్‌లోని జిల్లా పోలీసు కార్యాలయానికి ఉదయం తొమ్మిది గంటలకు హాజరుకావాలని సూచించారు. దరఖాస్తు సమయంలో జత చేసిన ధ్రువపత్రాల ఒరిజనల్ సర్టిఫికెట్లతోపాటు గెజిటెడ్ అధికారి సంతకం చేసిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలను, నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలను తీసుకురావాలన్నారు.