Share News

టీటీడీ ఉద్యోగిపై వెంకటగిరి ఎమ్మెల్యే ఫైర్‌

ABN , Publish Date - Jul 25 , 2025 | 02:03 AM

తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ టీటీడీ ఉద్యోగిపై విరుచుకుపడ్డారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకుని మహద్వారం గుండా ఎమ్మెల్యే వెలుపలకు వచ్చారు. ఆయన వెనుక ఉన్న అనుచరులను అదే దారిలో బయటకు పంపేందుకు గేటు వద్ద విధుల్లోవున్న ఉద్యోగి నిరాకరించారు

టీటీడీ ఉద్యోగిపై వెంకటగిరి ఎమ్మెల్యే ఫైర్‌
ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ఎమ్మెల్యే

మహద్వారం గేటు తీసేందుకు నిరాకరించడంతో ఆగ్రహం

తిరుమల, జూలై 24(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ టీటీడీ ఉద్యోగిపై విరుచుకుపడ్డారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకుని మహద్వారం గుండా ఎమ్మెల్యే వెలుపలకు వచ్చారు. ఆయన వెనుక ఉన్న అనుచరులను అదే దారిలో బయటకు పంపేందుకు గేటు వద్ద విధుల్లోవున్న ఉద్యోగి నిరాకరించారు. తాను ఎమ్మెల్యేనని రామకృష్ణ చెప్పినప్పటికీ గేటు తీయలేదు. పుష్కరిణి వైపు ఉన్న మార్గం ద్వారా బయటకు వెళ్లాలని ఆ ఉద్యోగి సూచించారు. దీంతో ఎమ్మెల్యేకి, ఉద్యోగికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఆలయ అధికారులు జోక్యం చేసుకుని గేటు తెరిపించి వెలుపలకు పంపారు.

Updated Date - Jul 25 , 2025 | 02:03 AM