Share News

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.72 కోట్లు

ABN , Publish Date - Dec 06 , 2025 | 01:38 AM

స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ.1,72,10,021 ఆదాయం లభించింది. శుక్రవారం ఆలయ ఆస్థాన మండపంలో ఈవో పెంచలకిషోర్‌ పర్యవేక్షణలో స్వామి కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు.

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.72 కోట్లు
:కానుకలు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ.1,72,10,021 ఆదాయం లభించింది. శుక్రవారం ఆలయ ఆస్థాన మండపంలో ఈవో పెంచలకిషోర్‌ పర్యవేక్షణలో స్వామి కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. 39 గ్రాముల బంగారు, 890 గ్రాముల వెండితో పాటు 932 యూఎస్‌,10 ఆస్ట్రేలియా, 2 సింగపూర్‌ డాలర్లు, 520 యూఏఈ దిర్హామ్స్‌, 10 ఇంగ్లాండు పౌండ్లు, 50 మలేసియా రింగిట్స్‌, 10 సౌదీ రియాల్స్‌ సమకూరాయి. అలాగే గో సంరక్షణ హుండీ ద్వారా రూ.16,514, నిత్యాన్నప్రసాద కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హుండీ ద్వారా రూ.22,067 ఆదాయం లభించింది. ఆలయానికి ఈ ఆదాయం 21 రోజులలో సమకూరినట్లు ఈవో తెలిపారు.డీఈవో సాగర్‌బాబు, అసిస్టెంట్‌ కమిషనర్‌ చిట్టెమ్మ, ఏఈవో రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనపాల్‌, ధనంజయ, సీఎఫ్‌వో నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 01:38 AM