Share News

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.60 కోట్లు

ABN , Publish Date - Dec 25 , 2025 | 01:40 AM

స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1,60,25,165 లభించింది. ఆలయ ఆస్థాన మండపంలో బుధవారం స్వామి కానుకలను చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ నేతృత్వంలో ఆలయ సిబ్బంది లెక్కించారు.

వరసిద్ధుడి హుండీ ఆదాయం రూ.1.60 కోట్లు
హుండీ లెక్కింపును పర్యవేక్షిస్తున్న చైర్మన్‌ మణి నాయుడు, ఈవో పెంచలకిషోర్‌

ఐరాల(కాణిపాకం), డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.1,60,25,165 లభించింది. ఆలయ ఆస్థాన మండపంలో బుధవారం స్వామి కానుకలను చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ నేతృత్వంలో ఆలయ సిబ్బంది లెక్కించారు. 16 గ్రాముల బంగారు, 1,650 గ్రాముల వెండి, 636 యూఏ్‌సఏ, 370 ఆస్ట్రేలియా, 162 సింగపూర్‌ డాలర్లు, 5 యూఏఈ దిర్హామ్స్‌, 20 ఇంగ్లాండ్‌ పౌండ్లు, 23 మలేసియా రింగిట్స్‌, 185 సౌదీ రియాల్స్‌ సమకూరాయి. గో సంరక్షణ హుండీ ద్వారా రూ.13,316, నిత్యాన్న ప్రసాదకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన హుండీ ద్వారా రూ.25,720 వచ్చాయి. ఆలయానికి ఈ ఆదాయం పూర్తిగా 19 రోజుల్లో లభించింది. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, డీఈవో సాగర్‌బాబు, అసిస్టెంట్‌ కమిషనర్‌ చిట్టెమ్మ, ఏఈవోలు రవీంద్రబాబు, ప్రసాద్‌, ధనుంజయ, సీఎ్‌ఫవో నాగేశ్వరరావు, పర్యవేక్షకులు వాసు, కోదండపాణి పాల్గొన్నారు.

అన్న ప్రసాదానికి రూ.లక్ష విరాళం

వరసిద్ధుడి ఆలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద కేంద్రానికి హైదరాబాద్‌కు చెందిన గోపిశెట్టిశ్రీహరి బుధవారం రూ.1,00,000 విరాళంగా అందించారు. దాతను ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రవి ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి దర్శన ఏర్పాట్లు చేశారు.

Updated Date - Dec 25 , 2025 | 01:40 AM