గంగమ్మకు వడిబాల
ABN , Publish Date - May 07 , 2025 | 01:10 AM
గంగమ్మ వడిబాల కట్టుకుంది. దీంతో జాతర సంబరాలకు, వేషాల సందడికి తిరుపతి సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్థూపానికి పరిమళ, పవిత్ర జలాలతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. పసుపు, కుంకుమ, నారికేళ, పాలు, పంచామృతం వంటి సుగంధద్రవ్యాలతో అమ్మవారి స్థూపానికి జరిగిన అభిషేకాన్ని వీక్షించిన భక్తజనం పారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్‌ను సైతం అభిషేకించి, వజ్రకిరీటధారణతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల దంపతులు, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, ఆలయ ఇఒ జయకుమార్, కూటమి నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, శ్రీఽధర్ వర్మ, మహేష్ యాదవ్, కొట్టే హేమంత్ రాయల్, రాజారెడ్డి, బాబ్జి, మన్నెం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
- విశ్వరూప స్థూపానికి విశేషాభిషేకం
- తిరుపతి జాతరకు చాటు వేసిన కైకాలవాళ్లు
తిరుపతి, మే6(ఆంధ్రజ్యోతి): గంగమ్మ వడిబాల కట్టుకుంది. దీంతో జాతర సంబరాలకు, వేషాల సందడికి తిరుపతి సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్థూపానికి పరిమళ, పవిత్ర జలాలతో అర్చకులు అభిషేకం నిర్వహించారు. పసుపు, కుంకుమ, నారికేళ, పాలు, పంచామృతం వంటి సుగంధద్రవ్యాలతో అమ్మవారి స్థూపానికి జరిగిన అభిషేకాన్ని వీక్షించిన భక్తజనం పారవశ్యంతో పులకించిపోయారు. అనంతరం అమ్మవారి మూలవిరాట్‌ను సైతం అభిషేకించి, వజ్రకిరీటధారణతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల దంపతులు, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం, ఆలయ ఇఒ జయకుమార్, కూటమి నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి, శ్రీఽధర్ వర్మ, మహేష్ యాదవ్, కొట్టే హేమంత్ రాయల్, రాజారెడ్డి, బాబ్జి, మన్నెం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అవిలాల నుంచి ఐదు ఆలయాలకు సారె
తాతయ్యగుంట గంగమ్మ, తాళ్లపాక పెద గంగమ్మ, అంకాళమ్మ, ముత్యాలమ్మ ఆలయాలకు అవిలాలనుంచి సారె అందింది. ‘ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియచేయడం ఏమనగా...నేటి నుంచి తిరుపతి గంగ జాతర మొదలైందహో..’! అంటూ తిరుపతి గంగజాతరకు మంగళవారం రాత్రి కైకాలకులస్థులు చాటింపు వేశారు. గంగమ్మ జన్మస్థలమైన తిరుపతి రూరల్ మండలం అవిలాలలో జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం అవిలాల గ్రామ పెద్దలు పూజలు నిర్వహించి పుట్టింట సారెను తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్‌కు అందించారు. అక్కడినుంచి ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి సారె తీసుకొచ్చారు. దీని వెంబడే స్థానిక కైకాల వారు నగర పొలిమేర్లలో చాటింపు వేశారు. జాతర పూర్తయ్యేంత వరకు నగరంలో నివశించేవారు బయటఊర్లకు వెళ్లి నిద్రించకూడదనేది చాటింపు అర్థమని పెద్దలు చెబుతుంటారు. చాటింపు రోజు చిరుజల్లులు పడడం ఆనవాయితీగా వస్తోందని, అందుకు తగ్గట్టే గంగమ్మ తల్లి కరుణించి చల్లబరిచిందని భక్తులు విశ్వసించారు.