Share News

వీడని యూరియా ఇక్కట్లు

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:31 AM

రైతులను యూరియా కొరత వేధిస్తూనే వుంది. సోమవారం యూరియా వస్తుందని తెలుసుకున్న పుంగనూరు, చౌడేపల్లె, రామసముద్రం మండలాల రైతులు ఉదయం 6గంటలకే పుంగనూరుకు చేరుకుని వ్యవసాయశాఖ అధికారులు ఎప్పడు పర్మిట్లు ఇచ్చి పంపిణీ చేస్తారోనని ఎరువుల దుకాణాల వద్ద నిరీక్షించారు.

 వీడని యూరియా ఇక్కట్లు
యూరియా పర్మిట్ల కోసం పడిగాపులు కాస్తున్న రైతులు

బందోబస్తు నడుమ పుంగనూరులో పంపిణీ

పుంగనూరు, సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): రైతులను యూరియా కొరత వేధిస్తూనే వుంది. సోమవారం యూరియా వస్తుందని తెలుసుకున్న పుంగనూరు, చౌడేపల్లె, రామసముద్రం మండలాల రైతులు ఉదయం 6గంటలకే పుంగనూరుకు చేరుకుని వ్యవసాయశాఖ అధికారులు ఎప్పడు పర్మిట్లు ఇచ్చి పంపిణీ చేస్తారోనని ఎరువుల దుకాణాల వద్ద నిరీక్షించారు.పెద్ద సంఖ్యలో రైతులు చేరుకోవడంతో అవాంచనీయ సంఘటనలు జరగకుండా వ్యవసాయశాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ వెంకటరమణ దుకాణాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.క్యూలైన్లు పెట్టి ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతుకు ఒక బస్తా చొప్పున పర్మిటు ఇచ్చి యూరియా పంపిణీ చేశారు. దీనికి తోడు ప్రతి రైతు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి బయోమెట్రిక్‌ తీసుకున్న తర్వాతే అనుమతి ఇవ్వడంతో పంపిణీ ఆలస్యంగా సాగింది. ఈ సందర్భంగా పుంగనూరు ఏడీఏ శివకుమార్‌ రాజు మాట్లాడుతూ రైతుసేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్లకు రెండు, మూడు రోజుల్లోపు యూరియాను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతులు యూరియా అధిక వినియోగాన్ని తగ్గించి బయోఫర్టిలైజర్‌లను, నానో డీఏపీని వినియోగించాలని ఆయన సూచించారు.

Updated Date - Sep 02 , 2025 | 01:31 AM