62 పాఠశాలల ఉన్నతీకరణ
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:43 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 62 పాఠశాలలను ఉన్నతీకరిస్తూ డీఈవో వరలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. 62 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించారు.
చిత్తూరు సెంట్రల్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 62 పాఠశాలలను ఉన్నతీకరిస్తూ డీఈవో వరలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. 62 ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించారు. ఖాళీలుగా ఉన్న మిగుల పోస్టుల మార్పిడి, అప్‌గ్రేడ్ వాటికి కొత్త పోస్టులు ఏర్పాటు చేయడం ద్వారా పోస్టుల లోటు తీర్చారు. జిల్లాలోని 618 వర్కింగ్ సర్‌ప్లస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం/హెచ్‌ఎంగా మార్చారు. మరో 490 పోస్టులు అప్‌గ్రేడ్ చేశారు.