Share News

కాణిపాకంలో అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ విధానం

ABN , Publish Date - Nov 30 , 2025 | 01:28 AM

కాణిపాకంలో త్వరలో అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ విదానాన్ని తీసుకురానున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ తెలిపారు. శనివారం కాణిపాకం వచ్చిన సీఎండీకి , ఎమ్మెల్యే మురళీమోహన్‌,ఆలయ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ స్వాగతం పలికారు.

కాణిపాకంలో అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ విధానం
సీఎండీ శివశంకర్‌కు వినాయకుడి చిత్రపటం అందిస్తున్న ఎమ్మెల్యే, చైర్మన్‌, ఈవో

ఏర్పాటు చేస్తామన్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ

ఐరాల(కాణిపాకం), నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో త్వరలో అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ విదానాన్ని తీసుకురానున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ శివశంకర్‌ తెలిపారు. శనివారం కాణిపాకం వచ్చిన సీఎండీకి , ఎమ్మెల్యే మురళీమోహన్‌,ఆలయ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అథిది గృహంలో ఆయనతో వారు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల నిర్వహణ సమయంలో వాహనాలు తిరిగే సమయంలో విద్యుత్‌ తీగల కారణంగా తీవ్ర ఇబ్బంది ఉందన్నారు. సీఎండీ స్పందిస్తూ త్వరలో అన్ని విద్యుత్‌ లైన్లను అండర్‌గ్రౌండ్‌ విదానంలోకి మారుస్తామన్నారు. ఇందుకు అంచనాలను తమకు పంపాలని సూచించారు. బోర్టు సభ్యులు చంద్రశేఖర రెడ్డి, సుధాకర రెడ్డి, సుబ్బారెడ్డి, నాగరాజునాయుడు, ఎస్పీడీసీఎల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 01:28 AM