Share News

ఆంధ్రజ్యోతి అక్షరం అండగా.. జీవకోన దశ తిరుగుతోంది

ABN , Publish Date - May 20 , 2025 | 02:10 AM

‘అక్షరం అండగా...సమస్యల పరిష్కారమే అజెండాగా..’ తిరుపతి నగరంలోని జీవకోనలో మూడు నెలల కిందట ఆంధ్రజ్యోతి ఏర్పాటు చేసిన సదస్సులో ప్రజలు వెల్లడించిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. సదస్సులో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ మౌర్య దృష్టికి వచ్చిన సమస్యలను దశల వారీగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. పాడైన బోర్లు మరమ్మతులు చేశారు. తిరుమల బైపాస్‌ రోడ్డునుంచి సత్యనారాయణపురం వెళ్లే 30 మీటర్ల రోడ్డు పనులు పూర్తి చేశారు. దీంతో ప్రజలకు రాకపోకలకు అవకాశం రావడంతో ఇబ్బంది తప్పింది. అదేవిధంగా జీవకోన పరిధిలోని సత్యనారాయణపురం-ఎర్రమిట్ట తూర్పు రోడ్డు రాళ్లు తేలిపోయివుండేది. ఆంధ్రజ్యోతి సదస్సులో రోడ్ల సమస్యలపై పలువురు ప్రస్తావించారు. రూ37.5 లక్షల నిధులతో యుద్ధప్రాతిపదికన సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. ఇక క్రాంతి నగర్‌, పార్వతి నగర్‌లో డ్రైనేజీ కాలువలు దెబ్బతిన్నాయి. రూ9.97లక్షలతో సీసీ డ్రైన్‌లను, బాలగంగమ్మ గుడి సమీపంలోని మాధవ నగర్లో రూ.7.40లక్షలతో సీసీ రోడ్డును కార్పొరేషన్‌ నిర్మించింది. అంతేకాకుండా మరో రూ.50 లక్షల పనులకు కమిషనర్‌ శనివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఆంధ్రజ్యోతి అక్షరం అండగా..  జీవకోన దశ తిరుగుతోంది

- సదస్సులో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తిరుపతి కమిషనర్‌

- రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు, మరికొన్ని పనులకు గ్రీన్‌ సిగ్నల్‌

- అవుట్‌ పోస్ట్‌తో పాటు 120 సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్‌ శాఖ సిద్ధం

(తిరుపతి- ఆంధ్రజ్యోతి)

‘అక్షరం అండగా...సమస్యల పరిష్కారమే అజెండాగా..’ తిరుపతి నగరంలోని జీవకోనలో మూడు నెలల కిందట ఆంధ్రజ్యోతి ఏర్పాటు చేసిన సదస్సులో ప్రజలు వెల్లడించిన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. సదస్సులో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ మౌర్య దృష్టికి వచ్చిన సమస్యలను దశల వారీగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. పాడైన బోర్లు మరమ్మతులు చేశారు. తిరుమల బైపాస్‌ రోడ్డునుంచి సత్యనారాయణపురం వెళ్లే 30 మీటర్ల రోడ్డు పనులు పూర్తి చేశారు. దీంతో ప్రజలకు రాకపోకలకు అవకాశం రావడంతో ఇబ్బంది తప్పింది. అదేవిధంగా జీవకోన పరిధిలోని సత్యనారాయణపురం-ఎర్రమిట్ట తూర్పు రోడ్డు రాళ్లు తేలిపోయివుండేది. ఆంధ్రజ్యోతి సదస్సులో రోడ్ల సమస్యలపై పలువురు ప్రస్తావించారు. రూ37.5 లక్షల నిధులతో యుద్ధప్రాతిపదికన సీసీ రోడ్డు నిర్మాణం చేశారు. ఇక క్రాంతి నగర్‌, పార్వతి నగర్‌లో డ్రైనేజీ కాలువలు దెబ్బతిన్నాయి. రూ9.97లక్షలతో సీసీ డ్రైన్‌లను, బాలగంగమ్మ గుడి సమీపంలోని మాధవ నగర్లో రూ.7.40లక్షలతో సీసీ రోడ్డును కార్పొరేషన్‌ నిర్మించింది. అంతేకాకుండా మరో రూ.50 లక్షల పనులకు కమిషనర్‌ శనివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

త్వరలో పోలీస్‌ అవుట్‌పోస్ట్‌

ఆకతాయిలు, అసాంఘిక శక్తుల నుంచి జీవకోనను కాపాడాలని పలువురు మహిళలు ఆంధ్రజ్యోతి సదస్సులో మొరపెట్టుకున్నారు. ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి ఎస్పీ హర్షవర్దన్‌ రాజు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన జీవకోనపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఇచ్చిన హామీ మేరకు అవుట్‌ పోస్ట్‌ ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. దీంతో పాటు జీవకోన ప్రాంతంలో 120 సీసీ కెమెరాలను పోలీస్‌ శాఖ ఏర్పాటు చేయనుంది. ఇక ఇటీవల ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జేఎంసీ ట్రస్టు తరఫున రెండు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

జీవకోన సమస్యలు పరిష్కరిస్తున్నాం

జీవకోనలో ఆంధ్రజ్యోతి చేపట్టిన సదస్సులో ప్రజలు లేవనెత్తిన సమస్యలను నోట్‌ చేసుకున్నాం. ప్రాధాన్యత పనులను దశలవారీగా పూర్తిచేస్తున్నాం. సదస్సు తర్వాత ఇప్పటికే సుమారు రూ.50లక్షల విలువగల రోడ్లు, డ్రైన్‌ కాలువలను నిర్మించాం. తాజాగా మరో రూ.52.30లక్షల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. రూ.6.50 లక్షలతో గోవిందనగర్‌లో సీసీ రోడ్డు, రూ.9.90 లక్షలతో జ్యోతి లెప్రసీ కాలనీలో సీసీ డ్రైన్‌, రూ.9.96లక్షలతో రాజీవ్‌గాంధీ కాలనీలో సీపీ డ్రైన్‌, అరుణోదయ నగర్‌, సత్యనారాయణపురంలో రూ.9.95లక్షలతో సీసీ డ్రైన్‌ నిర్మాణాలు, రూ.6లక్షలతో క్రాంతి నగర్‌, విజయపురం, పార్వతి నగర్‌ వద్ద యూడీఎస్‌ లైన్‌ పునరుద్ధరణ, సీసీ ప్యాచ్‌ పనులు చేపట్టనున్నాం. రూ.10లక్షలతో శ్మశానవాటిక ప్రహరీగోడ, సంతోషనగర్లో నీటి సంపు, నీటి పైపులైన్లను ఏర్పాటు చేయనున్నాం.

Updated Date - May 20 , 2025 | 02:10 AM