అడ్డూ అదుపు లేని గ్రానైట్ అక్రమ రవాణా
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:55 AM
పలమనేరు మీదుగా భారీస్థాయిలో గ్రానైట్ అక్రమంగా తరలిపోతోంది. రోజూ పదుల సంఖ్యలో భారీ లారీల ద్వారా గ్రానైట్ దిమ్మెలను తమిళనాడుకు తరలిస్తున్నారు.తమిళనాడులోని గ్రానైట్ ఫ్యాక్టరీలకు కాకుండా సరాసరి చెన్నె హార్బర్‌కు ఈ గ్రానైట్ వెళ్తుందని, అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తారని చెబుతున్నారు.స్థానిక మార్కెట్ కంటే మూడునాలుగురెట్లు డబ్బులు విదేశాలకు తరలించడం వలన దక్కుతుండడం వల్లే ఈ అక్రమరవాణా రోజురోజుకూ పెరిగిపోతోందని సమాచారం. ఈ గ్రానైట్ మన జిల్లాలోని క్వారీలనుంచే కాకుండా పొరుగున ఉన్న అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలనుంచి కూడా రవాణా అవుతోందని తెలిసింది.వాస్తవానికి క్యారీలనుంచి వెలికి తీసి రవాణాకు సిద్ధం చేసిన గ్రానైట్ దిమ్మెల కొలతలు తీసి, రాయల్టీ కట్టిన తరువాత మాత్రమే రవాణా చేయాలి.దీంతో ఒకట్రెండు గ్రానైట్ దిమ్మెలను తరలిస్తున్నట్లు రాయల్టీ చెల్లించి మిగిలిన గ్రానైట్ దిమ్మెలను అక్రమంగా తరలిస్తున్నారు.

. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి
. అలంకార ప్రాయంగా మైన్స్ కార్యాలయం
పలమనేరు మీదుగా భారీస్థాయిలో గ్రానైట్ అక్రమంగా తరలిపోతోంది. రోజూ పదుల సంఖ్యలో భారీ లారీల ద్వారా గ్రానైట్ దిమ్మెలను తమిళనాడుకు తరలిస్తున్నారు.తమిళనాడులోని గ్రానైట్ ఫ్యాక్టరీలకు కాకుండా సరాసరి చెన్నె హార్బర్‌కు ఈ గ్రానైట్ వెళ్తుందని, అక్కడి నుంచి విదేశాలకు తరలిస్తారని చెబుతున్నారు.స్థానిక మార్కెట్ కంటే మూడునాలుగురెట్లు డబ్బులు విదేశాలకు తరలించడం వలన దక్కుతుండడం వల్లే ఈ అక్రమరవాణా రోజురోజుకూ పెరిగిపోతోందని సమాచారం. ఈ గ్రానైట్ మన జిల్లాలోని క్వారీలనుంచే కాకుండా పొరుగున ఉన్న అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలనుంచి కూడా రవాణా అవుతోందని తెలిసింది.వాస్తవానికి క్యారీలనుంచి వెలికి తీసి రవాణాకు సిద్ధం చేసిన గ్రానైట్ దిమ్మెల కొలతలు తీసి, రాయల్టీ కట్టిన తరువాత మాత్రమే రవాణా చేయాలి.దీంతో ఒకట్రెండు గ్రానైట్ దిమ్మెలను తరలిస్తున్నట్లు రాయల్టీ
చెల్లించి మిగిలిన గ్రానైట్ దిమ్మెలను అక్రమంగా తరలిస్తున్నారు.
- పలమనేరు, ఆంధ్రజ్యోతి
పార్సిల్ లారీలను
పోలిన విధంగా....
సాధారణంగా ఏ సరుకును లారీలో తరలిం చినా వర్షానికి,ఎండకు దెబ్బతినకుండా వుండేం దుకు తార్పాల్ కప్పుతుంటారు.గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యాపారులు దిమ్మెలు పైకి కనిపించకుండా ప్లాస్టిక్ సంచులతో తయా రు చేసిన తార్పాల్‌ను కప్పి రవాణా చేస్తున్నారు. క్వారీలో రవాణాకు సిద్ధం చేసిన గ్రానైట్ దిమ్మెల పై మైన్స్ శాఖ సిబ్బంది వివరాలు స్పష్టంగా నమోదు చేస్తారు. క్వారీలనుంచి అధికారికంగా తరలించే గ్రానైట్ దిమ్మెలకు మాత్రం తార్పాల్ కప్పని రవాణాదారులు అనధికారికంగా రవా ణా చేసే దిమ్మెలకు మాత్రం తార్పాల్ కప్పి తమిళనాడుకు తరలిస్తున్నారు.
ఘాట్ రోడ్డయినా ఖాతరు లేదు
లారీల్లో పరిమితికి మించి గ్రానైట్ రవాణా చేసే స్మగ్లర్లు ఘాట్‌రోడ్‌ను సైతం ఖాతరు చేయడం లేదు. పలమనేరు నుంచి తమిళనాడుకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి పూర్తిగా ఘాట్‌రోడ్డు.ప్రమాదకరమైన మలుపులతో అటవీ మార్గంలో సాగుతుంది. ఏమాత్రం భారీ వాహనాలు ప్రమాదానికి గురైనా డ్రైవర్ల, క్లీనర్ల ప్రాణాలకే ప్రమాదం.ఇతర రహదారుల్లో పోలిస్తే వాహనాల రద్దీ నామమాత్రంగా వుంటుంది. అందువల్లే గ్రానైట్ రవాణాలో ఏ ప్రమాదాలు జరిగినా గుట్టు చప్పుడు కాకుండా అక్రమ రవాణాదారులు యుద్ధప్రాతిపదికన మరో వాహనంలోకి దిమ్మెలను మార్చుకుని వెళ్ళిపోతుంటారు.మరోవైపు వాహనాల్లో పరిమితికి మించి గ్రానైట్ దిమ్మెలు రవాణా అవుతున్నా దారిపొడవునా ఉన్న పోలీసు అధికారులు గానీ, రవాణా శాఖ అధికారులు గానీ పట్టించుకోకపోవడం అసలైన విశేషం. గ్రానైట్ అక్రమ రవాణాతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. క్వారీలనుంచి వెలికి తీసిన ప్రతి దిమ్మెకూ క్వారీ యజమాని నిర్ణీత మొత్తాన్ని రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి వుంది. అయితే గ్రానైట్ దిమ్మెల్లో సగానికి పైగా అక్రమ రవాణాలో గమ్యం చేరిపోతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
పరిమితికి మించి రవాణా
సాధారణంగా ఏ వాహనానికైనా సరుకు రవాణా చేసేందుకు పరిమితి ఉంటుంది. లారీల సామర్థ్యాన్ని బట్టి ఇది నిర్ణయిస్తారు. లారీల్లో తరలించే సరుకు పరిమితికి మించి వుంటే రవాణాశాఖ అధికారులు తనిఖీ చేసి భారీగా జరిమానాలు విధిస్తుంటారు. 40 టన్నుల వరకూ పరిమితి వుండే కంటైనరు లారీల్లో దాదాపు 60 టన్నుల దాకా గ్రానైట్ దిమ్మెలు తరలిస్తున్నారు. దీని వల్ల రోడ్లు ఛిద్రమైపోతున్నాయి. వేసిన కొద్దిరోజులకే దెబ్బతిని గుంతలు పడుతున్నాయి.