ఐకేఎస్ జాబితాలో రెండు వర్సిటీలకు స్థానం
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:45 AM
తిరుపతిలోని రెండు విశ్వవిద్యాలయాలకు ఇండియన్ నాలెడ్జ్ సిస్టం (ఐకేఎస్) గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన జాబితాను సోమవారం విడుదల చేసింది.
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని రెండు విశ్వవిద్యాలయాలకు ఇండియన్ నాలెడ్జ్ సిస్టం (ఐకేఎస్) గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన జాబితాను సోమవారం విడుదల చేసింది. జాబితాలో తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఈ గుర్తింపుతో రెండు వర్సిటీల్లో ప్రత్యేక పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు ఆర్థిక సహకారాన్ని ఐకేఎస్ అందించంది. తద్వారా భవిష్యత్తులో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గుర్తింపు రావడానికి అవకాశం ఏర్పడింది. తాజా గుర్తింపుపై సంసృత వర్సిటీ వీసీ కృష్ణమూర్తి, ఎస్వీ వేద వర్సిటీ వీసీ రాణిసదాశివమూర్తి హర్షం వ్యక్తం చేశారు.