Share News

ఘర్షణ కేసులో ఇద్దరికి ఏడాది జైలు

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:30 AM

ఓ డీకేటీ భూమి విషయమై గొడవ పడిన ఇద్దరు వ్యక్తులకు చిత్తూరు న్యాయస్థానం ఏడాది జైలు, జరిమానా విధిస్తూ తీర్పుచెప్పింది.

ఘర్షణ కేసులో ఇద్దరికి ఏడాది జైలు
శిక్షపడిన నిందితులు

పూతలపట్టు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఓ డీకేటీ భూమి విషయమై గొడవ పడిన ఇద్దరు వ్యక్తులకు చిత్తూరు న్యాయస్థానం ఏడాది జైలు, జరిమానా విధిస్తూ తీర్పుచెప్పింది. పూతలపట్టు మండలం పి.కొత్తకోట పంచాయతీ, వెంకటే్‌షనగర్‌కు చెందిన కోదండం, నవీన్‌కుమార్‌ 2019 మార్చి 18వ తేదీన డీకేటీ భూమి విషయమై గొడవ పడ్డారు. ఈ గొడవలో నవీన్‌కుమార్‌, అజయ్‌కుమార్‌ ఇద్దరూ కలిసి కోదండంపై దాడిచేసి గాయపరిచారు. దీనిపై కోదండం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూతలపట్టు పోలీసులు కేసు నమోదుచేసి ఇద్దరినీ రిమాండుకు తరలించారు. ఈ కేసు పూర్వాపరాలను బుధవారం చిత్తూరులోని రెండవ మేజిస్ట్రేట్‌ కోర్టులో పరిశీలించిన న్యాయమూర్తి మాధవి నిందితులకు ఏడాది జైలు, రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసును ఏపీపీ ఉమాదేవి వాదించారు.

Updated Date - Jun 19 , 2025 | 01:30 AM