రెండు మద్యం దుకాణాలకు మళ్లీ నోటిఫికేషన్
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:57 AM
జిల్లాలో ఇప్పటి వరకు లైసెన్సు ఫీజు చెల్లించని రెండు మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సోమవారం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది.
దరఖాస్తుల సమర్పణకు 10న ఆఖరు గడువు
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటి వరకు లైసెన్సు ఫీజు చెల్లించని రెండు మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ సోమవారం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. సూళ్లూరుపేట మున్సిపల్ పరిధిలో.. దొరవారిసత్రంలోని ఈ దుకాణాలకు ఈ నెల 10 వతేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించార.ఉ వచ్చిన దరఖాస్తులను 12న 8 గంటలకు కలెక్టరేట్‌లో పరిశీలించి లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. రానున్న 11 నెలలకు గాను సూళ్ళూరుపేట మున్సిపల్ పరిధిలో అయితే ఎక్సైజ్ ట్యాక్స్ కింద రూ 65,54,167, దొరవారిసత్రం పరిధిలో రూ.55,45,834 చెల్లించాలని ఎక్సైజ్ ఈఎస్ నాగమల్లేశ్వర రెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా లేదా హైబ్రిడ్ విధానం ద్వారా దరఖాస్తు చేయవచ్చన్నారు.