బస్సు ఢీకొని ఇద్దరి మృతి
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:29 AM
గంగాధర నెల్లూరు మండలం ఎట్టేరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ఒకరికి తీవ్ర గాయాలు
గంగాధర నెల్లూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : గంగాధర నెల్లూరు మండలం ఎట్టేరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సీఐ వాసంతి కథనం మేరకు.... ఈఆర్ కండ్రిగ దళితవాడకు చెందిన కుమార్(50), కోటాగారం దళితవాడకు చెందిన అరుణాచలం(65), దేశయ్య(55) ఓ ద్విచక్ర వాహనంలో శనివారం చిత్తూరు-పుత్తూరు రహదారిలోని మోతరంగనపల్లె వద్ద వెళుతుండగా చిత్తూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమార్, అరుణాచలం అక్కడికక్కడే మృతి చెందగా దేశయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.