ముసలి మడుగులో రెండు గంటలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:22 AM
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలమనేరు పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆయన్ను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు ఎగబడ్డారు. వారి తాకిడిని తట్టుకోలేక పోలీసులు ఆ ప్రాంతమంతా ఆంక్షలు విధించారు. షెడ్యూల్ కంటే గంట ఆలస్యంగా పలమనేరు సమీపంలోని పెంగరగుంట వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్న పవన్‌కు స్వాగతం పలికేందుకు కేవలం 8మందినే లోపలికి అనుమతించారు. జనసేన నాయకులు చాలామందికి అనుమతి లభించకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, జగన్మోహన్, మురళీమోహన్, చుడా ఛైర్‌పర్సన్ హేమలత, జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్,కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్, డీఎ్‌ఫవో సుబ్బరాజు తదితరులు పవన్‌కు స్వాగతం పలికారు. హెలిపాడ్ చుట్టూ తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు పవన్ అభివాదం చేశారు. ఎమ్మెల్యే గురజాల సూచన మేరకు తమిళనాడు నుంచి వచ్చిన అభిమానుల వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నారు. హెలిపాడ్ బయట పలువురు ఆయనకు సమస్యల మీద అర్జీలు ఇచ్చారు. అక్కడి నుంచి కారులో నేరుగా ఎలిఫెంట్ క్యాంపు వద్దకు వెళ్లిన పవన్ అటవీశాఖ అధికారుల పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను తిలకించారు.అటవీ శాఖ ఆధ్వర్యంలో ‘ఏనుగులతో మనుషులకు జరుగుతున్న అన్నిరకాల నష్టాల్ని తగ్గించే చర్యలు’ అనే అంశంపై నిర్వహించిన ఈ ప్రజంటేషన్ చూశాక అధికారులకు పలు సూచనలు చేశారు. హనుమాన్ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టరును ఆవిష్కరించారు.కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించారు.దాదాపు రెండుగంటల పాటు ముసలిమడుగులో వున్న పవన్ ఆద్యంతం చలాకీగా గడిపారు. నిరాశలో జనసేన శ్రేణులు
పలమనేరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలమనేరు పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆయన్ను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు ఎగబడ్డారు. వారి తాకిడిని తట్టుకోలేక పోలీసులు ఆ ప్రాంతమంతా ఆంక్షలు విధించారు. షెడ్యూల్ కంటే గంట ఆలస్యంగా పలమనేరు సమీపంలోని పెంగరగుంట వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్న పవన్‌కు స్వాగతం పలికేందుకు కేవలం 8మందినే లోపలికి అనుమతించారు. జనసేన నాయకులు చాలామందికి అనుమతి లభించకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.ఎమ్మెల్యేలు అమరనాథ రెడ్డి, జగన్మోహన్, మురళీమోహన్, చుడా ఛైర్‌పర్సన్ హేమలత, జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్,కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్, డీఎ్‌ఫవో సుబ్బరాజు తదితరులు పవన్‌కు స్వాగతం పలికారు. హెలిపాడ్ చుట్టూ తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు పవన్ అభివాదం చేశారు. ఎమ్మెల్యే గురజాల సూచన మేరకు తమిళనాడు నుంచి వచ్చిన అభిమానుల వద్దకు వెళ్లి సెల్ఫీ తీసుకున్నారు. హెలిపాడ్ బయట పలువురు ఆయనకు సమస్యల మీద అర్జీలు ఇచ్చారు. అక్కడి నుంచి కారులో నేరుగా ఎలిఫెంట్ క్యాంపు వద్దకు వెళ్లిన పవన్ అటవీశాఖ అధికారుల పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌ను తిలకించారు.అటవీ శాఖ ఆధ్వర్యంలో ‘ఏనుగులతో మనుషులకు జరుగుతున్న అన్నిరకాల నష్టాల్ని తగ్గించే చర్యలు’ అనే అంశంపై నిర్వహించిన ఈ ప్రజంటేషన్ చూశాక అధికారులకు పలు సూచనలు చేశారు. హనుమాన్ ప్రాజెక్టుకు సంబంధించిన పోస్టరును ఆవిష్కరించారు.కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించారు.దాదాపు రెండుగంటల పాటు ముసలిమడుగులో వున్న పవన్ ఆద్యంతం చలాకీగా గడిపారు.
నిరాశలో జనసేన శ్రేణులు
తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు రావడంతో జనసేన శ్రేణులు మురిసిపోయారు. తాము కలిసే అవకాశం ఉంటుందని, మాట్లాడి ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుందని భావించినా వారికి నిరాశే మిగిలింది. సాధారణంగా సీఎం చంద్రబాబు జిల్లాల్లో పర్యటించినప్పుడు టీడీపీ ముఖ్య శ్రేణుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. అలాగే లోకేశ్ పర్యటనల్లో శ్రేణుల కోసం సమయం కేటాయించి ఫొటోలు తీసుకుంటారు. ఆదివారం పవన్ కూడా అలా శ్రేణుల్ని, కనీసం నాయకుల్ని పలకరిస్తారని ఆశించారు. జనసేన నాయకులతోనే కాకుండా టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడా సమయాభావం వల్ల రిజర్వుడ్‌గానే వ్యవహరించారు.
రైతులతో ముఖాముఖి రద్దు
ఏనుగుల దాడుల్లో నష్టపోయిన బాధిత రైతులతో పవన్ మాట్లాడేలా రచ్చబండ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఎలిఫెంట్ క్యాంపు శిలాఫలకాల ఆవిష్కరణ అనంతరం అక్కడే రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. కానీ శిలాఫలకాల ఆవిష్కరణ అనంతరం పవన్ హుటాహుటిన కారులో హెలిపాడ్‌కు వెళ్లిపోవడంతో రైతులు నిరుత్సాహ పడ్డారు.మీడియా సమావేశం కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీ వద్దకు కూడా ఆయన రాలేదు. పవన్‌ను చూసేందుకు ఎలిఫెంట్ క్యాంపు వెలుపల వందలాదిమంది అభిమానులు ఎదురు చూసినా వారిని పోలీసులు తరిమివేయడంతో నిరాశపడ్డారు.
తోపులాటలో మహిళకు గాయాలు
ఎలిఫెంట్ క్యాంపును సందర్శించి తిరిగి హెలిప్యాడ్‌కు డిప్యూటి సీఎం వెళ్తుండగా మార్గమధ్యంలోని ఇందిరానగర్ వద్ద పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. హేమ అనే మహిళ అభిమానంతో హారతి ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు, అక్కడున్న అభిమానులు పక్కకు తోయడంతో ఆమె కాలికి గా యాలయ్యాయి.‘ఆమెను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి అన్ని పరీక్షలు నిర్వహించగా, ఎడమకాలికి చిన్న గాయమైందని..ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంగా వివిధ టీవీ ఛానెళ్లలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు.
కుంకీల కోసం చేసిన కృషిని వివరించిన అమర్
అడవి ఏనుగుల ద్వారా మనుషుల ప్రాణాలకు, పంటలకు తీవ్ర నష్టం కలుగుతోందని, కుంకీ ఏనుగులతోనే దీన్ని నివారించవచ్చని గుర్తించాను.అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీకు ఈ విషయంగా అర్జీ ఇచ్చాను. అసెంబ్లీలో ఇదే విషయమై రెండుసార్లు మాట్లాడానంటూ పవన్‌కల్యాణ్‌కు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చెప్పారు.తానీ విషయంలో చేసిన కృషికి సంబంధించిన రికార్డులను పవన్‌కు అందించారు.అటవీ శాఖ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ సమయంలో ఏనుగుల మంద కంటే ఒంటరి ఏనుగులతోనే ఎక్కువ ప్రమాదమంటూ వివరించబోయిన అమర్‌ను తాను మాట్లాడతానంటూ పవన్ వారించడం ఎమ్మెల్యేని నొచ్చుకునేలా చేసింది.