రెండు బైకుల ఢీ
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:54 PM
రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, ఒకరికి గాయాలయ్యాయి
వెదురుకుప్పం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాల మేరకు.. వెదురుకుప్పం మండలంలోని కొమరుగుంట గ్రామ పంచాయతీ సామిరెడ్డికండ్రిగకు చెందిన యుగంధర్(19) బైక్‌లో స్వగ్రామం నుంచి పచ్చికాపల్లం మీదుగా ఆదివారం తిరుపతికి వెళ్తున్నాడు. అదే సమయంలో తిరుపతి జిల్లా దుర్గసముద్రం వద్ద వడ్డిఇండ్లుకు చెందిన సాయికిరణ్(23) తన స్నేహితుడితో కలసి బైక్‌లో తిరుపతి వైపు నుంచి పచ్చికాపల్లంకు వస్తున్నాడు. సాయంత్రం బొమ్మనదొడ్ల క్రాస్ రోడ్డు వద్దకొచ్చేసరికి ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు నడుపుతున్న సాయికిరణ్(23), యుగంధర్(19)లు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌లో వెనుక వైపు ఉన్న తేజ(17) గాయపడటంతో చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. తేజ స్వగ్రామం వివరాలు తెలియలేదు. మృతులకు వివాహం జరగలేదని సమాచారం. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.