నేడు సీఎంతో టీటీడీ చైర్మన్, ఈవో భేటీ
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:21 AM
అమరావతిలో గురువారం సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలవనున్నారు.
తిరుమల, నవంబరు26(ఆంధ్రజ్యోతి): అమరావతిలో గురువారం సీఎం చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలవనున్నారు. ఇక్కడి వెంకటపాలెంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాకారం, కల్యాణోత్సవ మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం సీఎంతో వీరు భేటీ అవుతారు. గతంలో సీఎం సూచించిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు వంటి వివిధ అంశాలపై ఈ సందర్భంగా సీఎం సమీక్షిస్తారు.