Share News

విద్యార్థులకు రవాణా భత్యం విడుదల

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:40 AM

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులకు రవాణా భత్యాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు డీఈవో కేవీఎన్‌ కుమార్‌ గురువారం తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ప్రాథమిక పాఠశాలలకు ఒక కిలోమీటరు దూరం, ప్రాథమిక పాఠశాలలకు 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలలకు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సంవత్సరానికి రూ.6 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆమేరకు 6,752 మంది విద్యార్థులను విద్యాశాఖ గుర్తించింది. వీరికి మొదటి విడతగా రూ.2,02,56,000 ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసినట్టు డీఈవో తెలిపారు.

విద్యార్థులకు రవాణా భత్యం విడుదల

  • మొదటి విడతగా రూ.2.02 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ

తిరుపతి(విద్య), నవంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అర్హులైన విద్యార్థులకు రవాణా భత్యాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు డీఈవో కేవీఎన్‌ కుమార్‌ గురువారం తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో ప్రాథమిక పాఠశాలలకు ఒక కిలోమీటరు దూరం, ప్రాథమిక పాఠశాలలకు 3 కిలోమీటర్లు, ఉన్నత పాఠశాలలకు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు సంవత్సరానికి రూ.6 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆమేరకు 6,752 మంది విద్యార్థులను విద్యాశాఖ గుర్తించింది. వీరికి మొదటి విడతగా రూ.2,02,56,000 ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసినట్టు డీఈవో తెలిపారు.

Updated Date - Nov 21 , 2025 | 12:40 AM