జిల్లాలో పలువురు తహసీల్దార్ల బదిలీలు
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:53 AM
జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్ వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్దన్‌రాజును తిరుపతి రూరల్ మండలానికి.. అక్కడ పనిచేస్తున్న రామాంజులు నాయక్‌కు కలెక్టరేట్ ఏవోగా పోస్టింగ్ ఇచ్చారు.
తిరుపతి(కలెక్టరేట్), డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్ వెంకటేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ జనార్దన్‌రాజును తిరుపతి రూరల్ మండలానికి.. అక్కడ పనిచేస్తున్న రామాంజులు నాయక్‌కు కలెక్టరేట్ ఏవోగా పోస్టింగ్ ఇచ్చారు. ఏవో రమేష్ బాబును కలెక్టరేట్‌లోని ఇతర విభాగానికి బదిలీ చేశారు. కలెక్టరేట్ ఇ-సెక్షన్‌లో పనిచేస్తున్న లక్ష్మీనారాయణను బీఎన్‌కండ్రిగకు.. అక్కడి తహసీల్దారు శ్రీదేవిని సూళ్లూరుపేట ఆర్డీవో కార్యాలయానికి అటాచ్ చేశారు. శ్రీకాళహస్తి తహసీల్దార్‌ను రెండుమూడు రోజుల్లో నియమించనున్నారు.