Share News

ఎస్బీలో బదిలీలు

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:27 AM

స్పెషల్‌ బ్రాంచ్‌ ప్రక్షాళన దిశగా ఎస్పీ సుబ్బరాయుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏళ్ల తరబడి తిష్టవేసిన ఏడుగురిని అలిపిరి, ఎమ్మార్‌పల్లె, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట పోలీసు స్టేషన్లకు బదిలీ చేశారు.

ఎస్బీలో బదిలీలు

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): స్పెషల్‌ బ్రాంచ్‌ ప్రక్షాళన దిశగా ఎస్పీ సుబ్బరాయుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏళ్ల తరబడి తిష్టవేసిన ఏడుగురిని అలిపిరి, ఎమ్మార్‌పల్లె, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట పోలీసు స్టేషన్లకు బదిలీ చేశారు. అలాగే శ్రీకాళహస్తిలో పనిచేస్తున్న చెంచురామయ్యను తిరుపతి స్పెషల్‌ బ్రాంచ్‌కు, అలిపిరిలో పనిచేస్తున్న కుమారస్వామిని తిరుమల ఎస్బీకి బదిలీ చేశారు. అలాగే తిరుపతి ఎస్బీ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న జాకీర్‌హుస్సేన్‌, షణ్ముగం, ప్రశాంత్‌కుమార్‌, హరిప్రసాద్‌లను వారు పనిచేస్తున్న పోలీ్‌సస్టేషన్లకు పంపించేశారు.

Updated Date - Oct 12 , 2025 | 01:27 AM