Share News

జిల్లాలోని మావటీలకు మరోసారి శిక్షణ

ABN , Publish Date - May 25 , 2025 | 01:10 AM

కుంకీ ఏనుగులను కౌండిన్య అభయారణ్యంలో డ్రైవ్‌ చేసేందుకు వీలుగా జిల్లాలోని మావటీలకు మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. పలమనేరు, కుప్పం, పుంగనూరు రేంజ్‌లోని 30 మంది అటవీ సిబ్బంది గత ఏడాది డిసెంబరులో మైసూర్‌లోని దుబేరాలో ఏనుగుల డ్రైవ్‌పై శిక్షణ పొందారు.

జిల్లాలోని మావటీలకు మరోసారి శిక్షణ

చిత్తూరు సెంట్రల్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): కుంకీ ఏనుగులను కౌండిన్య అభయారణ్యంలో డ్రైవ్‌ చేసేందుకు వీలుగా జిల్లాలోని మావటీలకు మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. పలమనేరు, కుప్పం, పుంగనూరు రేంజ్‌లోని 30 మంది అటవీ సిబ్బంది గత ఏడాది డిసెంబరులో మైసూర్‌లోని దుబేరాలో ఏనుగుల డ్రైవ్‌పై శిక్షణ పొందారు. కాగా చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతం సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల దాడులను అరికట్టడంలో భాగంగా ఇటీవల బెంగళూరు నుంచి ఐదు కుంకీ ఏనుగులు పలమనేరు రేంజ్‌కు వచ్చిన విషయం తెలిసిందే. వీటిలో చిత్తూరు జిల్లాకు నాలుగు కేటాయించగా, ఒకటి తిరుపతి జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం ఐదు ఏనుగులతోపాటు గతంలోని రెండు ఏనుగులు కలిపి మొత్తం ఏడు ఏనుగులు ననియాలలో ఉన్నాయి. బెంగళూరు నుంచి కుంకీ ఏనుగులతో జిల్లాకు వచ్చిన మావటీలు ఇక్కడివారికి కుంకీ ఏనుగులతో ఎలా డ్రైవ్‌ చేయాలన్న దానిపై నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆపై కుంకీ ఏనుగుల సాయంతో జిల్లా అటవీ ప్రాంతాల్లో ఏనుగులు దాడులను అరికట్టనున్నారు.

Updated Date - May 25 , 2025 | 01:10 AM